పోస్ట్‌లు

TS PENSIONERS PRC CALCULATOR

TS PENSIONERS PRC CALCULATOR : TS Pensioners PRC Calculator How Check Pensioners Arrears Amount TS PRC 2021 Pensioners Pension Fixation Software ts pensioners prc calculator Telangana PRC 2021 New Basic Calculator PRC Calculator Telangana 2021 How to know pensioners new basic pay in PRC after fitment Pensioners PRC Calculate Pension Online PRC 2021 New PRC Calculator 2021 to Calculate New Basic Pay & Fitment Based Fitment Caliculation Software How to Check Telangana Pensioners New Basic Pension in PRC 2018 2021 New Fitment 30% Basic Pay of Pensioners

రావమ్మా! నూత్న వత్సరమా!!

రావమ్మా! నూత్న వత్సరమా! ******************** పరవశమందిన ప్రకృతి, శోభల గూర్చింది! ఎక్కడో కూసిన కోయిల కూత ఇక్కడి దాకా ప్రతిధ్వనిస్తూనే ఉంది! వసంతం వచ్చిందని చెప్పడానికేమో! పూసిన మావిళ్ళు విరగ గాయడానికి సిద్ధంగా ఉన్నాయి! చింతలెరుగని చింత చిగురు దొడిగి నోరూరిస్తోంది! మాఘానికి మాసమంత, ఉగాది నాటికి ఉసిరిగాయంత కాస్తుందట మామిడి చిగురు దొడిగిన చింత మాత్రం తక్కువా మామిడితో మమేకమై  వేపకున్న చేదుతో కలిసి సావాసం చేయడానికి కాయై,పండై అరచేతిలో పచ్చడై ఉగాది నాడు నోరూరింప జేయబూనింది వేపకాయంత వెర్రి అన్నారెందుకో.... వెర్రిది కాబట్టే పూతకొచ్చిన వేప  షడృచుల సమ్మేళనంలో శాంతచిత్తయై ఆరోగ్య చిట్కాలో సాంప్రదాయపు కొలబద్ధలో భాగమయ్యింది! మనిషి మనుగడకు మంచితనం నేర్చుకున్న ప్రకృతి ప్రసాదమే ఉగాది పచ్చడి! ఆరోగ్యానికి వరప్రదాయినిగా మానవ సౌభాగ్యానికి ఆరంభ సూచికగా విచ్చేసిన పండగే ఉగాది రైతులకు ఆనంద వారధి రంగు రంగుల ప్రపంచానికి ఆరంభ వీచిక... ప్రకృతి లెక్కలతో పంచాంగం చెప్పే  భవిష్యవాణి ప్రజల ప్రశ్నార్థకాలకో ఊరట! అందుకే జనమంతా నీకు హారతి పట్టి స్వాగతిస్తున్నారు! రావమ్మా! వత్సరమా! శ్రీ ప్లవ నామాంకితవై ప్రజల మనసు చూరగొని రావమ్

జై భారత్! జై జై భారత్!!

జై భారత్! జై జై భారత్!! ********************** ఆగని పోరాటం లో అన్నీ మజిలీలే! డెబ్బదైదు స్వాతంత్ర్యపు వేడుకలే జ్ఞాపకాలు రాబోయే కాలానికి తీపి గురుతులు! బానిస బ్రతుకు లేవొ తెలియని తరం నేటిది అనుభవాలు పండిపోయి త్యాగానికి మారుపేరై జీవించిన తరం నాటిది మానవతకు ప్రతి రూపం త్యాగానికి నిదర్శనం నాటి తరం....! కోరికలు నెరవేరకుంటె గుర్తు కొచ్చేదే త్యాగం ఈ తరం....! స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా అభివృద్ది లేదని ఎవరన్నారు? అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ ఒక అన్వేషణ! ఒక విజయం! విజయ తీరాలెన్ని దాటినా మరో విజయం ఎదిరి చూస్తూనే ఉంటుంది స్వార్థం మనిషి నావహించినప్పుడే మజిలీ ఆగమంటూంది జనం అలోచనలకు రూపం ఏర్పడుతుంది మార్పు కోరుకుంటుంది మనవేడుకలు ఆత్మావలోకనానికి నాంది పలకాలి క్రొత్త క్రొత్త ఆవిష్కరణలకు పునాది కావాలి మరోవందవ దినోత్సవానికి వారధియై నిలవాలి జై భారత్! జై జై భారత్!!               ******             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఆశల అడుగు (కవిత)

ఆశల అడుగు! ************* ఆశల పల్లకిలో కూర్చొని అటూ ఇటూ చూస్తున్నా కరోనా కాలి బూడిదయ్యిందేమోనని! రూపాంతరం చెందిన కరోనా రెండవ అడుగేసిందని తెలియక.. అయినా కొత్త సంవత్సరం ఆదిలోనే అంతం చేస్తుందేమో నని ఆరోగ్యం వెంట తెస్తుందేమోనని అపురూపం గా చూస్తున్నా! కొత్త సంవత్సరం కోటి ఆశలను క్రొంగొత్త ఆశయాలతో ఇంటివాకిట అడుగిందేమోనని అటూ ఇటూ చూస్తున్నా! తెల్లవారిన ఉషోదయపు కాంతుల్ని వెదజల్లుతూ, సూరీడు ఎప్పటిలా కాలగమనాన్ని అనుసరిస్తూ మౌనం గా ఆకాశయానం చేస్తూనే ఉన్నడు! కాలం తనవెంట తెచ్చుకున్న చలిదుప్పటి కప్పుకొని రోజూలా సంచరిస్తూనే ఉన్నది, నా బేలచూపులను చూసి నవ్వుకుంటూ ఇరువదవ సంవత్సరం వెనుదిరిగి చూడకుండా వెళ్లి నట్టనిపించింది! కాలం ఎప్పటిలా ఇరువదొకటిని మోసుకుంటూ నడుస్తోంది! ఎప్పటిలా నా స్వగతం స్వాగతగీతం ఆలపిస్తూ ముందుకు సాగుతోంది! నిశ్శబ్ద సంకేతాలను నెమరేసుకుంటూ....!!                 *********               --------యెనిశెట్టి గంగా ప్రసాద్.                                       కామారెడ్డి.                         సెల్: 9866447234.

మాతృభాష పై గేయం!

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...                 ఈ గేయం...! ఎటు బోయె ఎటు బోయె నామాతృభాషా పరభాషకంకితము నా పాఠశాల! మాతృ గడ్డ మీద మరులుడిగి పోయె డాలరూ మోజయ్యి డాబుసరియయ్యె!! చదివినా చదువుకూ విలువలేకుండే కొలువు కరువయ్యీ ఖండాలు దాటే భాషలో పట్టుకై పరభాష మోజయ్యి మాతృభాష ల్ని మర్చిపోయాడే!! పరదేశమేగీ కోట్లు సంపాదించి కన్నవారికె దూరమయ్యీ మాతృభూమిని మరిచినాడే మాత పితరులకె బంధువైనాడే!! ఎందరెందరొ చదువ కొందరే వెళ్ళగా మిగిలినోళ్ళకు మిగిలె పని వెదుకులాటా చేతి నిండ పనులు చెంత లేకుండగ ఉద్యోగమేమొ ఊసులేకపాయె!! మాతృ భాష మరిచి,పరభాష పనిలేక అటు,నిటూగాకుండ ఆధారమేలేక బ్రతుకు దారి గనక నుండనేల? గమ్యమెరుగని బాటసారి వేల!! ఎన్ని జూచిన గాని,యెరుగడే యీమనిషి పిల్లవాని మనసు యెరుగబోకుండనే ఆంగ్ల పాఠశాల కంప నేర్చిన వాడే ప్రభుత గూడ మార్చె బోధనమును!! అసలు సిసలు మాట అందమైన బాట మాతృభాష తోటె పరభాష నేర్చుట సాధ్యమౌను తెలియ తెలుగు వాడ! మనసు బెట్టి నడువ మాన్యుడవేనుర!! ఎటు బోయె ఎటు బోయె నామాతృభాషా పరభాషకంకితము నా పాఠశాల! ఎక్కడని వెదికేది ఈ బ్రతుకు త్రోవ భవిత నీదె యెరుగ నీ మాతృ భాష!!                     *****          

నిశ్శబ్ద సంకేతం (కవిత)

నిశ్శబ్ద సంకేతం...! **************** విద్య వినయాన్ని నేర్పుతుందనుకున్నా వివేకాన్ని మేల్కొలుపు తుందనుకున్నా! అహాన్ని పెంచుతుందనుకోలే....! మూఢత్వాన్ని ముందుంచుతుందను కోలే!! అంధ విశ్వాసాన్ని ఆదరిస్తుందనుకోలే!! అడుగు వర్గాల నణచి వేస్తుందనుకోలే! అంతులేని సంపద ను ప్రోగు చేసుకొని పుణ్యం కోసం వెంపర్లాతుందనుకోలే! దానాలు ధర్మాలు చేసి పేరు కోసం ప్రాకులాడుతుందనుకోలే!! పేదవాడి నాదుకోవాలన్న ఆరాటం వయసు పైబడి నప్పుడు పుట్టే ఆలోచనల ఫలితమనుకోలే...! పాపం చేయకుంటే పుణ్యం ప్రసక్తే లేదు! పాప పుణ్యాలనేవి లేనప్పుడు స్వర్గ నరకాలు లేవన్న మాటే ఇవేవీ లేనప్పుడు, బ్రతుకు బాటకు మార్గం! నిశ్శబ్ద సంకేతం.....!!             *****            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.                                    కామారెడ్డి                     సెల్: 9866447234.

బాధిత స్వగతం!(గేయం)

           బాధిత స్వగతం ************** ధృతరాష్ట్ర దుర్యోధనులు రాజ్య మేలు తున్నరూ! మంచేదో చెడు యేదో మర్మమెఱుగ కున్నరూ! పాలనెంత మంచిగున్న పాలిగాండ్ల మనసె రుగక ఆకర్షక పథకాలను అమలు జేస్తు ఉన్నరూ! ముందొచ్చిన కొమ్ముల కన్న వెనకొచ్చిన కొమ్ములే  వాడివన్న నిజాలనే వెనకేసుక వస్తున్నరు! పార్టి మార్చి నోళ్ళకే పదవులన్న మాట నిజం ప్రథములుగా నిల్చినట్టి పౌరులకేమి మిగిలే నమ్మి వచ్చినోళ్ళను నట్టేటనె ముంచినారె ప్రజాసేవ పేరునా పరుచుకొన్న ఆస్తులే చుట్టూ రా చూసుకొని మురిసి పోవు నాయకులే పదవుల పందేరం లో ముందుండే నేతలే! ఈ రాజ్యం నారాజ్యం ఈజనమే నాప్రజలని మురిసెడు వారెవ్వరూ పదవే నా వారసత్వ సంపదగా భావించెడు వారలే అందులోనె భవిత జూచి మురిసెడు నాయకులే ఒకవైపూ... అధికారం కావాలని అంగలార్చిచూస్తున్నది ప్రతిపక్షం మరోవైపు..... అధికారం నిల్పుకొనే యెత్తులు వేస్తున్నది యంత్రాంగం! ప్రభుత మంత్రాంగం! మధ్య నున్న తరం! మధ్య తరగతి గణం... ప్రజలు ప్రజలు గానే మిగిలి పోవు వారలే బడుగుల బ్రతుకులన్ని ప్రశ్నార్థకమే నాయే! ఏదీ యీ బంగారు పాలనా? ఏదీ యీ సమానత్వ పాలనా! ఏదీ ఏదీ ఏదీ.....?       !! దుర్యోధన!!                 ******              -----