బాధిత స్వగతం!(గేయం)
బాధిత స్వగతం
**************
ధృతరాష్ట్ర దుర్యోధనులు రాజ్య మేలు తున్నరూ!
మంచేదో చెడు యేదో మర్మమెఱుగ కున్నరూ!
పాలనెంత మంచిగున్న పాలిగాండ్ల మనసె రుగక
ఆకర్షక పథకాలను అమలు జేస్తు ఉన్నరూ!
ముందొచ్చిన కొమ్ముల కన్న వెనకొచ్చిన కొమ్ములే
వాడివన్న నిజాలనే వెనకేసుక వస్తున్నరు!
పార్టి మార్చి నోళ్ళకే పదవులన్న మాట నిజం
ప్రథములుగా నిల్చినట్టి పౌరులకేమి మిగిలే
నమ్మి వచ్చినోళ్ళను నట్టేటనె ముంచినారె
ప్రజాసేవ పేరునా పరుచుకొన్న ఆస్తులే
చుట్టూ రా చూసుకొని మురిసి పోవు నాయకులే
పదవుల పందేరం లో ముందుండే నేతలే!
ఈ రాజ్యం నారాజ్యం ఈజనమే నాప్రజలని
మురిసెడు వారెవ్వరూ
పదవే నా వారసత్వ సంపదగా భావించెడు వారలే
అందులోనె భవిత జూచి మురిసెడు నాయకులే
ఒకవైపూ...
అధికారం కావాలని అంగలార్చిచూస్తున్నది ప్రతిపక్షం
మరోవైపు.....
అధికారం నిల్పుకొనే యెత్తులు వేస్తున్నది యంత్రాంగం! ప్రభుత మంత్రాంగం!
మధ్య నున్న తరం! మధ్య తరగతి గణం...
ప్రజలు ప్రజలు గానే మిగిలి పోవు వారలే
బడుగుల బ్రతుకులన్ని ప్రశ్నార్థకమే నాయే!
ఏదీ యీ బంగారు పాలనా? ఏదీ యీ సమానత్వ పాలనా!
ఏదీ ఏదీ ఏదీ.....? !! దుర్యోధన!!
******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
****ఇది ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడలేదు.
బాధిత ప్రజలు అనుకునే మాటలుగా వారి స్వగతం ఉంటే ఇలా ఉంటుందన్న ఊహలో...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి