ఆశల అడుగు (కవిత)
ఆశల అడుగు! ************* ఆశల పల్లకిలో కూర్చొని అటూ ఇటూ చూస్తున్నా కరోనా కాలి బూడిదయ్యిందేమోనని! రూపాంతరం చెందిన కరోనా రెండవ అడుగేసిందని తెలియక.. అయినా కొత్త సంవత్సరం ఆదిలోనే అంతం చేస్తుందేమో నని ఆరోగ్యం వెంట తెస్తుందేమోనని అపురూపం గా చూస్తున్నా! కొత్త సంవత్సరం కోటి ఆశలను క్రొంగొత్త ఆశయాలతో ఇంటివాకిట అడుగిందేమోనని అటూ ఇటూ చూస్తున్నా! తెల్లవారిన ఉషోదయపు కాంతుల్ని వెదజల్లుతూ, సూరీడు ఎప్పటిలా కాలగమనాన్ని అనుసరిస్తూ మౌనం గా ఆకాశయానం చేస్తూనే ఉన్నడు! కాలం తనవెంట తెచ్చుకున్న చలిదుప్పటి కప్పుకొని రోజూలా సంచరిస్తూనే ఉన్నది, నా బేలచూపులను చూసి నవ్వుకుంటూ ఇరువదవ సంవత్సరం వెనుదిరిగి చూడకుండా వెళ్లి నట్టనిపించింది! కాలం ఎప్పటిలా ఇరువదొకటిని మోసుకుంటూ నడుస్తోంది! ఎప్పటిలా నా స్వగతం స్వాగతగీతం ఆలపిస్తూ ముందుకు సాగుతోంది! నిశ్శబ్ద సంకేతాలను నెమరేసుకుంటూ....!! ********* --------యెనిశెట్టి గంగా ప్రసాద్. ...