రావమ్మా! నూత్న వత్సరమా!!
రావమ్మా! నూత్న వత్సరమా! ******************** పరవశమందిన ప్రకృతి, శోభల గూర్చింది! ఎక్కడో కూసిన కోయిల కూత ఇక్కడి దాకా ప్రతిధ్వనిస్తూనే ఉంది! వసంతం వచ్చిందని చెప్పడానికేమో! పూసిన మావిళ్ళు విరగ గాయడానికి సిద్ధంగా ఉన్నాయి! చింతలెరుగని చింత చిగురు దొడిగి నోరూరిస్తోంది! మాఘానికి మాసమంత, ఉగాది నాటికి ఉసిరిగాయంత కాస్తుందట మామిడి చిగురు దొడిగిన చింత మాత్రం తక్కువా మామిడితో మమేకమై వేపకున్న చేదుతో కలిసి సావాసం చేయడానికి కాయై,పండై అరచేతిలో పచ్చడై ఉగాది నాడు నోరూరింప జేయబూనింది వేపకాయంత వెర్రి అన్నారెందుకో.... వెర్రిది కాబట్టే పూతకొచ్చిన వేప షడృచుల సమ్మేళనంలో శాంతచిత్తయై ఆరోగ్య చిట్కాలో సాంప్రదాయపు కొలబద్ధలో భాగమయ్యింది! మనిషి మనుగడకు మంచితనం నేర్చుకున్న ప్రకృతి ప్రసాదమే ఉగాది పచ్చడి! ఆరోగ్యానికి వరప్రదాయినిగా మానవ సౌభాగ్యానికి ఆరంభ సూచికగా విచ్చేసిన పండగే ఉగాది రైతులకు ఆనంద వారధి రంగు రంగుల ప్రపంచానికి ఆరంభ వీచిక... ప్రకృతి లెక్కలతో పంచాంగం చెప్పే భవిష్యవాణి ప్రజల ప్రశ్నార్థకాలకో ఊరట! అందుకే జనమంతా నీకు హారతి పట్టి స్వాగతిస్తున్నారు! రావమ్మా! వత్సరమా! శ్రీ ప్లవ నామాంకితవై ప్రజల మనసు...