జై భారత్! జై జై భారత్!!
జై భారత్! జై జై భారత్!!
**********************
ఆగని పోరాటం లో
అన్నీ మజిలీలే!
డెబ్బదైదు స్వాతంత్ర్యపు
వేడుకలే జ్ఞాపకాలు
రాబోయే కాలానికి
తీపి గురుతులు!
బానిస బ్రతుకు లేవొ
తెలియని తరం నేటిది
అనుభవాలు పండిపోయి
త్యాగానికి మారుపేరై
జీవించిన తరం నాటిది
మానవతకు ప్రతి రూపం
త్యాగానికి నిదర్శనం
నాటి తరం....!
కోరికలు నెరవేరకుంటె
గుర్తు కొచ్చేదే త్యాగం
ఈ తరం....!
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా
అభివృద్ది లేదని ఎవరన్నారు?
అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ
ఒక అన్వేషణ! ఒక విజయం!
విజయ తీరాలెన్ని దాటినా
మరో విజయం ఎదిరి చూస్తూనే ఉంటుంది
స్వార్థం మనిషి నావహించినప్పుడే
మజిలీ ఆగమంటూంది
జనం అలోచనలకు రూపం ఏర్పడుతుంది
మార్పు కోరుకుంటుంది
మనవేడుకలు ఆత్మావలోకనానికి
నాంది పలకాలి
క్రొత్త క్రొత్త ఆవిష్కరణలకు
పునాది కావాలి
మరోవందవ దినోత్సవానికి
వారధియై నిలవాలి
జై భారత్! జై జై భారత్!!
******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి