పోస్ట్‌లు

డిసెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

జిల్లా కవి సమ్మేళనం!(కవిత)

జిల్లా కవి సమ్మేళనం! ****************** కవులు కవయిత్రుల కలాల కదలికలు  మ్రోగించె సమర శంఖం! తెలుగు స్వరాల కమ్మదనం తెలుగు భాష ప్రాచీనత తెలయజెప్ప వేదికయై గతకాలపు తరం  తెలుగు కవుల గొప్పదనం చాటి చెప్ప సమయమొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం  బాధ్యతగా నెంచబూనె విశ్వవ్యాప్తమొనర్చ నెంచి ప్రపంచ తెలుగు మహాసభల కూర్చనెంచి జిల్లా సభలో కవులకలాల కదిలింపజేసిరి నేడు డిగ్రీకళాశాల వేదికగా సమధికోత్సాహమ్మున చేసిన కవుల కవితాగానం మ్రోగె ఘంటారవమ్మై వెలిగె తెలుగు ప్రభలు విశ్వ వ్యాప్తమగునట్లుగ! ధన్యజీవులార మీరు! వందనాలభివందనాలు!!                 ....::::....                --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కవిత!

జంట విహంగాల గగన గమనం జంట ప్రేమికుల జలవిహారం విహంగాలకు కులంలేదు గోత్రం లేదు జంట ప్రేమికులకు కులగోత్రాలు కానరావు యుగ ధర్మం మారొద్దని  వేదాలు ఘోషిస్తున్నాయా సాంప్రదాయం ఏంచెప్పినా మానవ ధర్మం మారుతూనే ఉంది మనుషుల మనస్తత్వం మారణ హోమం సృష్టిస్తూనేవుంది! మతం మత్తులా విస్తరిస్తుంటే కులం అడ్డు గోడల్ని చీల్చుకుంటూన్న యువత రిజర్వేషన్లను వదలనంటున్నది వర్ణసంకరం జరిగిన జంట వంశాంకురానిదేకులం? అంటూ ప్రశ్నిస్తున్నది. కులవర్గాల విశ్లేషణ ఈనాటిది కాదు కాకుంటే అంతరాల అంతర్మథనం మనల్ని వేధిస్తున్న సమస్య! అంతరంగం లోని ఆంతర్యం అంతుబట్టని సమస్య! కులాలకు చిన్నాపెద్దలేమిటి? జీవించటం అందరిహక్కు ఆత్మగౌరవానికి తరతమభేధమా! సమానత్వం సమభావం సాధనయేలక్ష్యం! అందుకు గురి కుదరాలి నిబద్ధత ఉండాలి! చట్టాలు చిట్కాలు కావు చిట్కాలతో మాయమయ్యే చిరు సమస్య కాదు జ్ఞాన సముపార్జన అందరి హక్కు జ్ఞానం ముఖవర్చస్సు కు తేజస్సు విజ్ఞాన ప్రపంచం లో కులవివక్ష నీలి మబ్బులాంటిది,నీడలా వెన్నంటి నిండా ముంచేది! అందుకే రిజర్వేషన్ ఒక అస్త్రమై  రాజకీయులకు సమ్మోహన మయ్యింది ఓటు బ్యాంకు వజ్రాయుధమై  దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతోంది దేశం వెనుకబ...

కవితలు!

కులాల కుంపట్లనెగదోసెడు వాడు పుస్తకాలెన్నైన వ్రాయనెంచు, మతవాదులపట్ల కసిగలవాడెవడైన విమరసలెన్నైన చేయనెంచు, భావసమైక్యతకు కృషిజేయనెంచెడు మనిషి గాని, వర్గవిభజన కోరెడు రచనలు సేయగోరెడు వారు, రచయితలు కాబోరు వాసికెక్కనెంచి వార్తలకెక్కుచు వాతలేగొందురు విశ్వమందిది నిజము గనుడు మీరు!!     ............       యెనిశెట్టిగంగాప్రసాద్            కామారెడ్డి కన్నీటి సిరాతో కలం పట్టి వ్రాసేదొక్కటే కవిత్వమైతే జీవితమంతా కన్నీటిమయమే! బాదాతప్త హృదయాలకు స్పందన కవిత్వం రూపు దిద్దుకోవచ్చు అలాగే స్పూర్తి నింపే కవిత్వమూ కవిత్వమే! వినోదపూరిత కవిత్వమూ  కన్నీటి హృదయాలకో స్వాంతన! హృదయాన్ని స్పందింపజేసేదేదైనా కవిత్వమే!      .....యెనిశెట్టి గంగాప్రసాద్

అవిశ్రాంత ఉద్యోగి!(కవిత)

అవిశ్రాంత ఉద్యోగి! ***************** విశ్రాంత ఉద్యోగులమంటారు అవిశ్రాంతంగా ఉంటారు!  వడివడిగా అడుగులేస్తు జనంలోకి వెల్తారు! ప్రజాసేవ చేయుటకై పరుగులు దీస్తుంటారు! వృద్దులసంక్షేమానికి ఉరకలు వేస్తుంటారు ఊరూరా సంఘాలను వెలయింపజేస్తారు! ఆలుమగల బంధాలను బలోపేతం చేయుటకై కౌన్సిలింగు చేస్తారు! వైద్యశాలల్లొ సహాయకులుగ వెల్తారు! అమాయకపు జనులకిది ఆలంబనగా ఉంది! ఉరకలెత్తిన ఉత్సాహం వయసును మరిపిస్తోంది! మా మంచి సంఘమిది మెరుగైన సంఘమిది మధురస్మృతులకు వెలుగు యిది!!                   .....:::::.....                 --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

భాషకు పట్టాభిషేకం!(కవిత)

భాషకు పట్టాభిషేకం! ****************** దేశభాషలందు లెస్సభాష తెలుగు తేటతేట పదాలనల్లు తెలుగు మాండలికమునల్లు మది చూరగొను తెలుగు జీవభాషలకెల్ల మేలు తెలుగు అమ్మ భాష తెలుగు అమృతభాష తెలుగు కమ్మనైన పదాల తేట తెలుగు అమ్మ,నాన్నల పిలుపు అమృతమయ్యేను మమ్మీ, డాడీల పిలుపు కృత్రిమంబే యౌను తెలుగు తోడుగ పరభాష మేలౌను పరభాషకు తెలుగు తోడుండతగదు! మనము పుట్టిన గడ్డ పురిటి గడ్డ భాష పుట్టిన గడ్డ మరువ తగదు అప్పడే మన భాషకు పట్టాభిషేకమగును!!                    .....:::::.....                    -------యెనిశెట్టి గంగాప్రసాద్.

పెన్షన్ నినాదం!(కవిత)

పెన్షన్ నినాదం! ************** నాదం నినాదాల మధ్య నలిగి పోతున్న నిజం పెన్శన్ స్కీం! సి.పి.యస్. వద్దని ఓ.పి.యస్సె ముద్దన్న నిజం ఇన్నాల్లకు తెలిసొచ్చింది ప్రమాదం పొంచి ఉందని తెల్సినా దీర్గ సూత్రుని  విజ్ఞత పాటించిన  నాయకత్వం!  దెబ్బ తగిల్తె గాని తెల్సిరాలేదు, సముద్రంలాంటి సంఘాలు కులాలవారీగ వర్గాలవారిగా పాయలై చీలి పోయాయి. రిజర్వేషన్ల భూతం సమైక్యతకు తూట్లు పొడుస్తుంటే ఉద్యోగుల జీవన మూలస్థంబం పెకిలించబడుతున్న విషయం తెలియకున్నది! మొదటి స్తంభపు పునాది ఓ.పి.యస్! కళ్ళు తెరిచిన నాయక గణం  పట్టువీడని విక్రమార్కులై పోవాలి విభిన్న రాజకీయ రంగస్థలి ఏకమైతే ఏప్రభుత్వ మైనా దిగిరాకపోతుందా! పోరాడితేఫలితం రాకుండా పోదు నీవిజ్ఞత నీధైర్యం నీకె ఫలితమిచ్చు కదలిరమ్ము సోదరా! ఉపాద్యాయ సోదరా!!                   ....:::::;;....                --యెనిశెట్టి గంగాప్రసాద్               విశ్రాంత ప్రధానోపాద్యాయులు                     ...

రాజకీయ విలువలు!(కవిత)

రాజకీయ విలువలు! ****************** మానవత్వపు విలువలు మరుగునబడిపోతున్నయ్ (మంటగలిసి పోతున్నయ్) కులాల కుంపట్లు రాజుకుంటున్నయ్ మతాల మారణ హోమం రగుల్తూనే ఉంది! మతమార్పిడి చిచ్చు ఒకవైపు కులాల ఎగదోత మరోవైపు మనుషుల్లొ మార్పుకు అవరోధం కల్పిస్తున్న మేధావుల రాజకీయం అంతుబట్టని నాటకీయం అభివృద్ధి దిక్కులు చూస్తూ నడి బజారులొ నిలబడి ఉన్నది న్యాయం చట్టం చేతిలొ నలిగి పోతున్నది ఎన్నాళ్ళయినా రిజర్వేషన్ వదలనంటున్నది ఆసరాలు అలాగే ఉండాలంటున్నయ్ అందుకే అభివృద్ధి ఎటుబోతున్నది? పార్టీ నేతల ప్రణాళికల్లొ పదిలంగా దాగున్నది!!              .....:::::.....                        __యెనిశెట్టి గంగాప్రసాద్                                          కామారెడ్డి 

బంగారు తెలంగాణ!(కవిత)

బంగారు తెలంగాణ! ****************** తెలంగాణ మాగాణిలొ తెనుగు పూలు పూస్తున్నయ్ తెలుగు వెలుగుల జిగి బిగి పలుకుల తెలంగాణ నా కోటిరత్నాల జాణ, బంగారు తెలంగాణకు  బాటలు రూపు దిద్దుకుంటున్నది! బడ్జెట్టుకు లోటు లేకుండగ ,ప్రజామోదక పథకాలు బారులు తీరి కూర్చున్నయ్! అవి ఫలించి, అర్హులైన ప్రజలచెంత జేరితే బంగరు తెలంగాణకు బాట రూపు దిద్దుకున్నట్టె!                     *******                --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

తెలుగు భాషా వైభవం!(కవిత)

తెలుగు భాషా వైభవం! ******************** దేశభాషలందు తెలుగు లెస్సటంచు కవివర్యుడాముక్తమాల్యదను రచించె జిగిపలుకులతొ విరచించె మనుచరిత్ర నల్లసానివారు,అందముగను! హాస్యోక్తులతోడ పద్యమాలికలల్లి వికటకవియయ్యె! తెనాలిరామక్రిష్ణ! సకలజనులకెల్ల మార్గదర్షిగ నుండి తెనిగింపబడినట్టి మహాభారతమ్ము అలరె కవిత్రయముల కలములందు వాసికెక్కిన మహాభాగవతమ్ము పోతన కలమున మెరుపులు మెరియంగ ఎన్నెనొ కావ్యములవగతంబు జ్ఞానపీఠమెక్కిన విశ్వనాథ, భారధ్వాజలు వాసికెక్కినారు! 'విశంభర' విరచిత సి.నా.రె మెరిసె మన తెలంగాణ ధ్రువతారగను ఇలలొ జ్ఞానతృష్ణను గ్రోలిన కవులు మిగుల సామాజిక హితముగోరి, కాళోజి,ధాశరథులు,గూడ అంజన్న, లలరించు గేయమాలికలెన్నొ, పేరుపేరున కీర్తింపనెంచి ధన్యులమయ్యెదముగాక కవివర్యులార! పదునుపెట్టుడి మీ కలాలకింక గళమెత్తి పాడగ ప్రభోదగీతమై మెరియులాగ తెలుగు వెలుగుల మెరిపించునింగి మెరియ! చాటరా నీతెలుగు భాషా వైభవమును!!!                       .....:::::::.......                               ---------యెనిశెట్టి...

ఎవరు బాధ్యులు?(కవిత)

ఎవరు బాధ్యులు? **************** కడివెడు కంటినీరొలికించెను కమలలోచన తన మగడు త్రాగుబోతుయై  తప్పుడు దారిన నడచుచునుండెనని వచ్చిన నెలజీతంబీయక  పూటకొక్క రుచులంగ్రోలెడు మగడితండు మందు విందులకు మరిగినయీ మగపురుషుడీతడు డబ్బు మోజు పెంచుకొని లంచానికి పెద్దపీట వేసినవాడై పట్టుబడ్డ యీ  మనిషి పదుగురెదుట నిలబెట్టెను మగనాలిని యాతడు అనాథలైరి చిన్నారి చిరు ప్రాయపు పిల్లలు! ఎవరు భాద్యులెవరు భాద్యులీ గతికి త్రాగిన మగవాడిదా! త్రాగించిన సహచరులదా! అమ్మిన  షాపువాడిదా! అమ్మించిన సర్కారుదా! చట్టబద్ద హెచ్చరికలు చట్టబద్ద అమ్మకాలు! ఏవి నిజం! ఎవరు భాద్యులు?             .....::::.....              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

వనవిహారం!(కవిత)

                         వనవిహారం! ************ ఓ వనం! ఆ వనంలో మనం! మనం చిన్నారుల్తొ, ఆట పాటలతొ మనకూ వారికీ మధ్య అనుబంధాలు మమతానురాగాలు వారాంతపు సెలవుల్లొ ఎంత హాయి పిల్లల కేరింతలు పెద్దలకదే వినోదం, విశ్రాంతి! వారంలోని అలసట వారాంతంలొ విశ్రాంతి! పిల్లలతొ అనుబంధానికి పునాది! ప్రతి రోజూ ఆఫీసుతో కుస్తీ ఇంటికొస్తె పిల్లల హోంవర్క్ తొ కుస్తీ! మార్కులు రాలేదని లొల్లి ఇద్దరి మధ్య అంతరం ఏర్పడేదక్కడే, తల్లిదండ్రులు కోరుకునేదొకటి పిల్లలమననసునకందనిది అదే ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచేది, మధ్యతరగతి మానవునికేదీ విశ్రాంతి! అందుకే వారాంతంలొ వనకేళీ విశ్రాంతికి పునాది అందుకే కూరిమితో వివరిస్తె ఆలోచనలకందివచ్చే పిల్లలు కారా మన ఆలోచనలకు ప్రతిరూపాలు! వారే మన భవితకు వారసులు!!              ......:::::::::......                         -----యెనిశెట్ట...

రాజకీయాలు!(కవిత)

రాజకీయాలు! ************ తొలి రాజకీయాలు మానవత్వపు పలకరింపులు!!         ..... మలి రాజకీయాలు మాలిన్యపు విరిజల్లులు!!          ..... కుల రాజకీయాలు ఓటు బ్యాంకు నిలయాలు!!           ..... ధన రాజకీయాలు దరిద్రానికి రహదారులు!!           ..... మతం ఉచ్చులు మానవత్వపు సమాధులు!!           .....            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఓటరు ధీరుడే!(పాట)

ఓటరు ధీరుడే! ************** ఓటమెరుగని ఓటరెప్పుడు ధీరుడే ఓటు విలువను తెలుసుకొనినప్పుడే నోటుకోటును నమ్మబోకను ఓటమూల్యమైనదని యెరిగినన్.                                            !!ఓటమెరు!! లంచగొండుల తరిమి కొట్టి నీతి పరులను యెన్నుకొనుచు జాతి మేల్ తలపెట్టినప్పుడె ప్రజాస్వామ్యం పరిఢవిల్లును.  !!ఓటమెరు!! కులమతాలను పోషిస్తూ  రాజకీయం రంగుదేల్చగ రిజర్వేషన్ చిచ్చుబెట్టగ వర్గ పోరులు తప్పవయ్యె.       !!ఓటమెరు!! చిన్న చితకపార్టీలతొ చిచ్చు రేపెడి నాయకులే పదవిమోహము పదును అవుతూ మత్తుగొలిపెడు తాయిలాలే తమ్ముడూ                                               !!ఓటమెరు!! **

మాతృభాష!(మణి పూసలు)

       మాతృభాష (మణి పూసలు)         ************************ ఏదేశముననున్న యేవాసముననున్న మరువద్దునీభాష మృతభాషకాదన్న!! అమ్మ నేర్పిన భాష అమృత మ్మదేభాష చిన్న నాటనెనేర్పె గోరుముద్దల భాష!! యేభాష నేర్చినా యేదేశమేగినా చాటరా నీభాష యేసభలకెల్లినా!! ముద్దులొలికెడుభాష అందమైనది భాష ఆరాధ్యనీయమని తెలుసుకొ మాతృభాష!!            *****          --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

మహిళా!ఓ మహిళా!!(పాట)

మహిళా!ఓ మహిళా!! ******************* మహిళా ఓ మహిళా నువు మాన్యురాలవమ్మా.   !! మహిళా!! గుర్తెరుగనిగ్రుడ్డివాళ్ళు కించపరచనెంతురమ్మ నీవు లేక బ్రతుకు లేదు నిక్కమిదే నమ్ముమమ్మ!      !! మహిళా!! సృష్టి వైచిత్ర్యమ్మున చిధ్రమయే బ్రతుకు నీది ఇదే అదనుగ యెంచి అహం వీడకుండ జనం  ఆలోచనరహితులైరి.           !! మహిళా!! అమ్మ లాంటి దానవని అవనికీవె మూలమని యెంచనివారలైరి  దవులే మరి ధరలోన.         !! మహిళా!! మగవానికి మహనీయత తెచ్చెడుదానవనీ వెన్నంటే వుందు వీవు వ్యధలను మరిపించగలదానవు.!!మహిళా! సత్యా,కృష్ణులనీ సీతా రాములనీ ఉమామహేశ్వరులని లక్ష్మీనారాయణులనీ ముందే నీపేరు బలికి గుర్తించిన సంస్కృతి మనదీ.   !! మహిళా!! సాహసానికూపిరివై ధైర్యానికి మారుపేరు చరిత గలిగియున్నదానవమ్మ చెరపలేరు నీ కీర్తి.                  !! మహిళా!! జీవితాన సగభాగం దినచర్య లొసమభావం పరిపాలన లోనీవు పరిణితి నీదేనమ్మ.            !! మహిళా!! విద్యలోన నీవే విలువిద్యలోన నీవే చట్టసభలొ నీవ...

మహిళ!(కవిత)

మహిళ! ******** మహిళ లేని మగవాడెక్కడ మగడు లేని మహిళ యెక్కడ ఇద్దరూ నాణేనికి బొమ్మా బొరుసే బండి చక్రాలు రెండు ఒకేవిధంగా నడుస్తాయి! వాటికి చిన్నా,పెద్దలుండవు ఎక్కువ తక్కువలుండవు! కుటుంబం బండికీఅంతే ఆడా,మగా రెండూ రథచక్రాలే ఒకరు లేక మరొకరు లేరు! ఈ సత్యం యెరిగితేనె కుటుంబం బాగు బాగు! కుటుంబాలు యెదిగితేనె వ్వవస్థే బహు బాగు!!          ******        --మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో...              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఓటు విలువ!(కవిత)

ఓటు విలువ! ************ ఓటెందుకు దండగ అనుకుంటిని ముందుగా ఓటు విలువ తెలిసి వచ్చె నోట్లు గుమ్మరించవట్టె ఆసరా పథకాలు ఆసరాగ నిలువవట్టె మహిళల కల్యాణలక్ష్మి మంచి గున్న వనవట్టిరి వృద్ధాప్యం ఆసరా ఆలంబనగా నిలువగ దివ్యాంగుల దీవెనలే కోటి దివ్వెల వెలుగు గా రైతు బంధు పథకాలు రైతులకొక తీపి గుర్తు ఆత్మహత్య లాగిపోతె ఇక నైనా బాగుండు అవినీతి అంతానికి పథకమొకటి ఉంటే మరి యింకా బాగుండు! ఆకర్షక పథకాలు,కావివి జనాకర్షక పథకాలివి! ఏవైతే నేం! ఓట్లు దండుకోడానికి ఇహం,పరం కలిసి వచ్చె అంతం కాదిది ఆరంభం మాత్రమే అభివృద్ధికి సూచికగా నిలిస్తే, నిలువెత్తు ధనరాశులు ఓట్ల రూపంలో..... అల్పసంతోషులమే, మేము అందుకే, ఓటు విలువ తెలిసి వచ్చె నోటుకమ్ముడుపోవద్దని! ఓటు వేయముందర ప్రశ్నించే హక్కు నీది ఓటు వేసే బాధ్యతగా స్వీకరించినప్పుడే!!                  **********                           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఏం వ్రాయాలి?(కవిత)

ఏం వ్రాయాలి? ************** ఏం వ్రాయాలి? వ్రాయాలి, ఏదో వ్రాయాలి ఎండకన్నెరుగని కన్నె గురించి వ్రాయనా! ఎండవానకోర్చి బ్రతుకు తెరువు కై భవిత సుదూరంలో లేదని బ్రతుకు బండి లాగుతున్న అమ్మా,నాన్నలకాసరాగా నిలుస్తున్న అమ్మాయి గురించి వ్రాయనా! అక్షరం ముక్క రాకున్నా జీవన సత్యాలను పాటకట్టి పాడుతున్న తంబురా గురించి వ్రాయనా! ఏం వ్రాయను, ఎలా వ్రాయను? రానున్న కాలానికి దిశానిర్దేశం చేసే రాజకీయం గురించి వ్రాయనా సామాన్యుల వేదనలోని ఆక్రోశం గూర్చి వర్ణించనా! ఏం వ్రాయను? ఏమనివ్రాయను! శ్రీ శ్రీ లా గళం లేదు సిరి వెన్నెల రాగం లేదు విశ్వనాథుని లోని పట్టులేదు వేమనవాదం అబ్బలేదు భావాలుంటే భాషతోడు రాదు భాష ఉంటే భావాలొకచోట కుదురుగా ఉండవే... ఈ రెండింటి కీ అన్వయం కుదిరితే దిట్టంగా వ్రాయగలను దండిగా వ్రాయగలను అప్పటిదాకా కవిగా గార్చే కన్నీటి ఆశ్రువులుగా నిల్చే ఈ నాలుగక్షరమ్ముక్కలే ప్రపంచ కవిత్వానికి ఆసరాగా .....! నిలుస్తాయి!        --------యెనిశెట్టి గంగా ప్రసాద్.                ...

మరో మారణ హోమమే!(కవిత)

మరో మారణ హోమమే! ********************* జలము లేక బలము లేదు నీరు లేక నిప్పు లేదు జలమే జీవికి ప్రాణాధారం ఆ జీవే తన అధరవును పోగొట్టుకుంటుంటే  మూగజీవుల రోదన  మనల ముచ్చెమటలు పట్టించవా! వనాల కొట్టేసి వన్యప్రాణుల నీడ లేకుండా జేస్తే నిస్తేజమై నిస్త్రాణ గా మిగిలిన ఆప్రాణులు జనజీవన స్రవంతిలో కలిస్తే మనకీ వాటికీ సమరమే! మరో మారణహోమమే!            *****               --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఓటు!(కవిత)

కవితా శీర్షిక:.  ఓటు మంచోనికి ఓటెయ్ మని చెప్పువాడె ఘనుడు ఆ మంచోడెవడొ తెల్యజెప్ఫు ఘనుడా!!           ..... తాయిలాల హామీలే తంపులు బెట్టు రకాలాయె వర్గాలుగ చీలి పోయి ఎబ్బెట్టుగ మారిపోయె!!             ..... సద్భావం సమభావం అసలె కానరాదాయె చీడ పీడ తగిలి నట్లు చిందర వందరనాయె!!             ..... రాజకీయ మంటే వృత్తి లాగ మారిపోయె సొంత లాభమే సాంతం సరసంగా ఉండిపాయె!!              .....       ---యెనిశెట్టి గంగా ప్రసాద్

ఓటు వేయు!(కవిత)

ఓటు వేయు!                """"""""""""""""        కోటకు బీటలు వారునో ఓటులవూట కోటకు జేరునో పూటుగ త్రాగుచు ఓటెటువేతురో జనం నాడి జగతిన పట్టలేరెవరును విజ్ఞులెందరో గలరీఉర్విలోన పట్టపు రాజుల భవిత నేడే గదా! పరుగునజేరవచ్చు చున్నట్టి ధీర ఓటరులార! దూరప్రాంతాల విడిచి యరుగుదెంచి ప్రభువు లెవరో నిర్ణయించ, చనెడు స్వస్థలంబుల ఓటమెరుగని వీరులు మీరే నోటు బంచిన నేతల దునుమాడఓటు వేసి, నిలుప రావయ్య ప్రజాస్వామ్య మరియ!!                         --------యెనిశెట్టి గంగా ప్రసాద్.                                       కామారెడ్డి              ...

పుస్తక దినోత్సవ సంబరాలు!(కవిత)

పుస్తక దినోత్సవ సంబరాలు! ************************* పుస్తకాలు మస్తకాలకు పనికల్పించే ఆయుధాలు! పుస్తకాల దినోత్సవాలు మస్తకాలకు సంబురాలు ఛాత్రోపాద్యాయుల సమీక్షలు స్వీకృత భావ సంపదలు పుస్తకం హస్తభూషణం మస్తకం భావుకుల వికేంద్రీకరణం! ఈ-పుస్తకాల యుగం డిజిటల్ కాలం నడుస్తూన్న ప్రపంచీకరణ నేపథ్యంలో పుస్తకాల దినోత్సవ ప్రేరణ అభిలషణీయం! అమందానందకరం! భావాలగమనం! సామాజిక ప్రయోజనం! సమీక్షకుల భావసమ్మేళనం బహుముఖ ప్రజ్ఞా పాటవం! కవులకది ప్రేరణగా మిగిలిన జ్ఞాపకం!                     ******               --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఆగండీ!ఆగండీ!(పాట)

ఆగండీ! ఆగండీ!(పాట) ******************** ఆగండీ! ఆగండీ తమ్ముల్లారా! చెల్లెల్లారా ఆగండీ! ఆలోచించండీ! పరీక్ష లంటే భయము వలదులే ఫలితాలంటే చింతపడొద్దూ!   !! ఆగండీ!! అమ్మా నాన్నల ప్రేమమూర్తులూ! నేటి భారతికి త్యాగనిరతులూ! అభివృద్ధికి మీరు పునాది రాళ్ళు! ఆనందానికి వారధులూ!!        !! ఆగండీ!! పదులు దాటిన వయసే మీది పాపం పుణ్యం యెరుగనివారే! విజయ సాధనకు పోరాటం! విజ్ఞత యెరుగని వయసయ్యా!! !! ఆగండీ!! ఆత్మహత్యలకు అలవి కాదులె ఆలోచించిన అవగతమౌనూ! నిన్ను నీవే చంపుకొనీ  అమ్మా నాన్నల చంపొద్దూ!!     !! ఆగండీ!! జీవితమే ఒక పోరాటం! అనంతమైనది ఈ యాగం! ఈయాగంలో నువు కావొద్దూ సమిధగ మారొద్దూ!                  !! ఆగండీ!! పదిలో పరీక్ష లైనా ఇంటర్మీడియట్ పరీక్షలైనా ప్రాణం తీసే ఫలితాలకు  నువు వెరువొద్దూ!!                    నీ జీవితానికీ అంతం పలకొద్దు. !! ఆగండీ!! నీ ప్రాణం నీది కాదు, నువ్వే నాప్రాణమనే అమ్మా నాన్నల ప్రేమఫలమనీ మరువొద్దూ!!            ...

ఊరేగింపు!(గేయం)

               ఊరడింపు (గేయం) ఆగండీ! ఆగండీ తమ్ముల్లారా! చెల్లెల్లారా ఆగండీ! ఆలోచించండీ! పరీక్ష లంటే భయము వలదులే ఫలితాలంటే చింతపడొద్దూ!   !! ఆగండీ!! అమ్మా నాన్నల ప్రేమమూర్తులూ! నేటి భారతికి త్యాగనిరతులూ! అభివృద్ధికి మీరు పునాది రాళ్ళు! ఆనందానికి వారధులూ!!        !! ఆగండీ!! పదులు దాటిన వయసే మీది పాపం పుణ్యం యెరుగనివారే! విజయ సాధనకు పోరాటం! విజ్ఞత యెరుగని వయసయ్యా!! !! ఆగండీ!! ఆత్మహత్యలకు అలవి కాదులె ఆలోచించిన అవగతమౌనూ! నిన్ను నీవే చంపుకొనీ అమ్మా నాన్నల చంపొద్దూ!!     !! ఆగండీ!! జీవితమే ఒక పోరాటం! అనంతమైనది ఈ యాగం! ఈయాగంలో నువు కావొద్దూ సమిధగ మారొద్దూ!                  !! ఆగండీ!! పదిలో పరీక్ష లైనా ఇంటర్మీడియట్ పరీక్షలైనా ప్రాణం తీసే ఫలితాలకు నువు వెరువొద్దూ!!                   నీ జీవితానికీ...

జోహార్ రైతన్నా!(కవిత)

జోహార్ రైతన్నా!(కవిత) ******************** బండబారినబ్రతుకులకు మొండివాదన! మోడువారిన బ్రతుకులకు మిగిలెవేదనా! పండించిన రైతు కన్న పండించని రైతు మిన్న మిన్నకుంటే రైతు భరోసా సాగుచేస్తే గుండె కోతా పసిడి లాంటి పసుపు రైతుకు పోరాటమే విధివ్రాత! కలంబట్టిన కవి కన్నా కలిసి చేస్తున్న రైతు పోరాటం మిన్న! నిరసనల వెల్లువ నింగినంటినవేళ రైతే రాజుగా పోటీ లో ఆరాటం! నిర్మలచిత్త పోరాటం! అడుగడుగునా అడ్డు కట్టలేయబూనిన విచ్చుకత్తుల కౌగిలి నుండి విషపు నాగుల విస్తృత విన్యాసం యేమీ చేయలేక బిత్తరవోయిచూస్తూన్న రాజకీయ శక్తుల సుడి నుండి పిడికిలి బిగించి ఐక్యంగా తెలిపే నిరసన దేశమెల్లెడల ప్రాకి విశ్వవ్యాప్తమై ప్రపంచానికే తలమానికమైన మీ నిరసనకు జోహార్ రైతన్నా! జోహార్!             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

పున్నమి రేయి ముచ్చట్లు!(కవిత)

పున్నమి రేయి ముచ్చట్లు! *********************** పున్నమి రేయి ముచ్చట్లు మన ఎన్నీలముచ్చట్లు కవులందరు గూడితే తె.ర.వే. కవుల చప్పట్లు!! ఏమూలనడిగిన గాని ఏ చంద్రునడిగిన గాని కాలేజి గోడలనైన ఈముచ్చటే విరిబోణి!! ముచ్చట్లు మొదలయ్యి వత్సరం గడిచెనోయి వార్షిక సంచికనే వెలుగు కు తెచ్చెనోయి!! పుస్తకాల ముచ్చట్లు మస్తకాల పనిముట్లు విద్యార్థుల స్పందనలే తె.ర.వేకభినంధనలు             *****              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

హోరు పాట!(కవిత)

హోరు పాట!(కవిత) ***************** పాటల హోరులో హోరు పాట సాక్షయ్యింది! తె.ర.వే.లో దీటుగా నిలిచింది నెలపొడుపు రోజున నెలవయ్యి  స్తిరచిత్తులకు నేస్తమయ్యింది గఫూర్ శిక్షక్ కలంలోసిరాయై,  సమాజపు ఒంపు లకు వన్నెలద్దే కుంచెగా  నిలిచి నిలువెత్తు సాక్షయ్యింది! సిద్ధాంతపు పోకడలో స్థిరనివాసమేర్పరచుకొని పాటే పోరు బాటయ్యింది! ఘనాపాటి కవులకు మేటి గా నిలిచింది! పాడిన ప్రతి పాటా నిప్పు కణమై మెరిసి పచ్చి నిజాలకు నిలువెత్తు సాక్షిగా పోరు బాటకు మొదటి అక్షరంగా బాద్యతల బరువును మోసే సైనికుడికి వెన్నంటి నిలిచే అక్షరం ఈ హోరు పాట!!          ********** ****సిరిసిల్లా గఫూర్ శిక్షక్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో...!!           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

హోరు పాట!

హోరు పాట!(కవిత) ***************** పాటల హోరులో హోరు పాట సాక్షయ్యింది! తె.ర.వే.లో దీటుగా నిలిచింది నెలపొడుపు రోజున నెలవయ్యి  స్తిరచిత్తులకు నేస్తమయ్యింది గఫూర్ శిక్షక్ కలంలోసిరాయై,  సమాజపు ఒంపు లకు వన్నెలద్దే కుంచెగా  నిలిచి నిలువెత్తు సాక్షయ్యింది! సిద్ధాంతపు పోకడలో స్థిరనివాసమేర్పరచుకొని పాటే పోరు బాటయ్యింది! ఘనాపాటి కవులకు మేటి గా నిలిచింది! పాడిన ప్రతి పాటా నిప్పు కణమై మెరిసి పచ్చి నిజాలకు నిలువెత్తు సాక్షిగా పోరు బాటకు మొదటి అక్షరంగా బాద్యతల బరువును మోసే సైనికుడికి వెన్నంటి నిలిచే అక్షరం ఈ హోరు పాట!!          ********** ****సిరిసిల్లా గఫూర్ శిక్షక్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో...!!           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

బ్రతుకు గీతం!(పాటు)

భావగీతం/బ్రతుకు గీతం! ********************** బ్రతుకు బాటకు బడి బాట       త్రోవ! సర్కారు సారు కిది ఘనమైన        సేవ! ఉచిత ముగ నిచ్చేరు పుస్తకాలు ఉచిత మధ్యాహ్నన్న భోజన సంబురాలు! 'టై'లు,బెల్టులిచ్చి సోకు గా సరిజేసి చిట్టి పాపల చిరు మోము జూడంగ మాలిన్యమంటని  మల్లెమొగ్గలె        వారు!                   !! బ్రతుకు!! ఆట పాటలతోడ పాఠాలు నేర్పుతూ పెద్ద తరగతి పిల్ల మనసు లను రంజిల్ల ట్రిక్కులెన్నో నేర్చి శాస్త్ర సాంకేతికత బోధనల్ విరియంగ డిజిటల్ యుగమ్మె విరాజిల్లుచుండగా ప్రైవేటు దాటంగ       పోరాటమే!              !! బ్రతుకు!! సర్కారు సారు కిది సంకుల సమరమట బడిబాట ఫేలయితే తాఖీదుతప్పదట బడి మూతకు బాట భవిష్యత్తు గుండెకోత బడి లోని ఖాళీలు ప్రభుతకార్థిక సంపదలు ప్రైవేటుకివి సంబరాలు! ఏయేటికాయేడు, పెరిగే         దోపిడీలు!                  !! బ్రతుకు!! మంచి చదువులున్న సార్లు మాబడినుండిరని నైత...

రైతు గీతం!(కవిత)

రైతు గీతం! ********** బక్కచిక్కిన రైతు బాగు యెన్నాల్లకో పండించిన పంట విలువయెన్నాల్లకో! రైతు బంధు రక్ష యెవరి బాగుకొరకొ ఆసరా పథకాలు ఆరోగ్యకరమైతె లేనోడి కుండేను భవిత భరోసా!! పండినా పంటకీ రక్ష యే పాటిదో! కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర వచ్చు యెన్నాళ్ళకో! రైతు పంటకు ధర రక్తి కట్టే దెపుడొ! పండించిన పంట బంగారమగు నెపుడొ బంగారు తెలంగాణ బాట పడునెపుడో!           *****         --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

బాధిత మహిళకేదీ ఊరట?(కవిత)

           బాధిత మహిళకేదీ ఊరట?             *********************** నట్టింట నడయాడుతున్న నెట్టింట్లో 'యూ'గొట్టపు విషపు కత్తులు యువరక్తాన్నురకలేయిస్తుంటే కీచకులే కీర్తి కిరీటాలు తొడుక్కోక యేంచేస్తారు? చట్టాలు చుట్టాలై న్యాయాన్ని నడిబొడ్డున అపహాస్యం చేస్తుంటే కీచకులకు కీర్తి భుజకీర్తులు కాకుంటాయా? చట్టం అందరితో సమానంగా ఆడుకుంటే కొందరే పదవిలేహ్యం ఎందుకు పూసుకుంటారు? నిరసించిన చట్టమే ఎందుకు నీరసించి పోతుంది? యాంత్రిక యుగం తాంత్రిక యుగం గా ఎందుకు మారుతుంది! స్వచ్ఛభారతంటూనే కల్తీ కందెనను పులుముకొని విషపు నవ్వులు నవ్వే విషనాగుల్నివదిలేసి మధ్యతరగతి మందభాగులవెంటబడితే ఏమొరుగుతుంది? తినే తిండి కల్తీ,పీల్చే గాలి కల్తీ,మనసులూ కల్తీయే అయినప్పుడు యోగులైనా భోగులే అవుతున్నరు! నాగరికత నగుబాటవుతుంటే తుంటిరి వెధవలకు తల్లీ,చెల్లికి తేడా తెలియకుండా పోతోంది పసిపిల్లకీ, వయసుడిగిన వారందరూ ఒకే విధంగా కనిపిస్తూన్నరు రాజకీయం వెన్నంటి ఉన్నంత కాలం పోకిరీలకు దీటుండదు మోసాలకు మోక్ష ముండదు ఆడపిల్లకు రక్షణుండదు చట్టాలెన్నున్నా నేతల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి బడా బా...

గెలుపెవరిది?(కవిత)

          గెలుపెవరిది?           ************ ఉత్కంఠ పోరులో ఉప్పెనొచ్చింది ఆ ఉప్పెనలొ ఇంగ్లాండు కొట్టుకొచ్చింది కప్పు పట్టుకొచ్చింది!         ***** పోరాడి పోరాడి అలసిపోయింది ఓడినా యాదిలో నిలిచియే ఉంటది కీవీసు జట్టుకది కొద్దిలో తప్పింది కొదమ సింఘమోలె పోరాడి ఓడింది ఓటమి కాదది ఓటమి లో గెలుపు గెలుపు లో ఓటమి        *****         --------యెనిశెట్టి గంగా ప్రసాద్. ***ఇంగ్లాండు-న్యూజీలాండు జట్ల మధ్య జరిగిన ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్లో "టై" సూపర్ ఓవర్లో కూడా "టై" ఫోర్లు సంఖ్యా పరంగా ఇంగ్లాండ్ గెలుపు.అంటే సాంకేతిక గెలుపు.

సాగిపో ముందుకు..!(కవిత)

సాగిపో ముందుకు..! ****************** కలలుగన్న కార్మిక జనానికి కాలగర్భంలో కి తీపి జ్ఞాపకం ఎలాగూ చెక్కర చేదయ్యింది చెరుకు అచేతనమయ్యింది అనారోగ్యపు పొరలు క్రమ్మి మధుమేహానికి కారణమయ్యావని మధుర జ్ఞాపకాల్లోకి నెట్టేసింది పోనీలే! పోరు బాట జ్ఞాపకాలు పదిలంగా దాచుకో! నీ వేదన నీలోనే నెగళ్ళొగదోయకుండ నింగి వైపు తలయెత్తి కన్నీటి బొట్లు రాల్చుకో! మనసున్న మారాజులు మద్దతిచ్చి యేలికల మనసు కరుగదీయరా! కార్మికా! కర్షకా! సాగిపో ముందుకు                  ********                     --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

పాట!

చేయాలని మనసుండాలి చేతగాని పనియేముంది నేతలు తలరాతలు మార్చే ధీరులమని చెప్పుకొందురే!!     !! ఎన్నికల్లో కొల్లలుగా నే హామీలిచ్చిన నేతల్లారా వినండి భాదితుగోల కనండి సమస్య లివియే.         !! ఎన్నెన్నో సమస్యలంటూ అవలీలగ తీర్చెదమంటూ ఖర్చుకు వెనుకాడకుండా ముందుకురుకు చున్నారే!!      !! పెన్షనర్ల సమస్యలంటే చిన్న చూపు చూస్తారెందుకు వృద్దులంటె గౌరవమంటూ సమస్య దీర్చగ వెనుకడుగెందుకు పి.ఆర్.సి పెండింగెందుకు ఐ.ఆర్ ఇవ్వవెందుకు కమిటీ యే సిఫార్స్ జేసిన డెబ్బదేండ్లకే క్వాంటమివ్వవు.   !! అడిగిన కోర్కెలు కొన్నే ఇవ్వడానికి జాప్యమెందుకు పోరాటం చూడాలని వుందా పోయేదేమని అనుకున్నావా! పోరాటం ఆగదింకా ఇచ్చేవి ఇవ్వకదప్పదు న్యాయం మావైపునుంటే మా గెలుపే మీదికాదా!!        !! ధరలేమో పెరుగావట్టే రోగాలు తొంగి చూడగ అనారోగ్యం కాటు వేయగ పొంచి పొంచి చూస్తోందే పెన్షనేమొ పెరగదాయే నిరుద్యోగ పిల్లలున్న  బాధితులకు బాధ్యత దీరదు మనసు కేమొ వేదనాయే మాబాధ మీకు పట్టదాయే.       !! మా సమస్య దీర్చక తప్పదయ్యా పోరాటం ఆగదయ్యా పోరాడి తెచ్చుకొ...

మరో జ్వలిత గీతం!(కవిత)

           మరో జ్వలిత గీతం!            **************** ఆశువుగా చెప్పలేను అప్పుడప్పుడో కవిత అందంగా చెప్పగలను ఆనందం కలిగినపుడు మనసు ఉరకలెత్తినపుడు పులకరించి పోతాను మానవతయె పెరిగినపుడు నన్ను నేను మరుస్తాను దీనంగా జూచువాడి కళ్ళవెనుక యేముందో చూడగలిగితే నా గుండె జాలిగా మూగవోయి చూస్తుంటే నాకవితాధారయె స్ర్మృతిగా నీకింకేమివ్వగలను? నేత నసలు కాకపోతి ఆసరాగ నిలువకుంటి ఆశువుగా జెప్పు కవిత నీ ఆకలి తీర్చదే అయినా నీకేం తెలుసు అక్షరానికున్న విలువ అక్షరమే ఆయుధమై ఉద్యమానికూతంగా నిలుస్తుందని, జాలిగుండె జలధారయై మహోజ్వలపు ఉప్పెనయై సాగుతుందని, జాలి లేని నేతలంత మరుగున బడిపోతే మరో జ్వలితగీతం క్రొత్త వెలుగు నిలుస్తుందని...             *********                          --------యెనిశెట్టి గంగా ప్రసాద్..

మరో జ్వలిత గీతం!(కవిత)

           మరో జ్వలిత గీతం!            **************** ఆశువుగా చెప్పలేను అప్పుడప్పుడో కవిత అందంగా చెప్పగలను ఆనందం కలిగినపుడు మనసు ఉరకలెత్తినపుడు పులకరించి పోతాను మానవతయె పెరిగినపుడు నన్ను నేను మరుస్తాను దీనంగా జూచువాడి కళ్ళవెనుక యేముందో చూడగలిగితే నా గుండె జాలిగా మూగవోయి చూస్తుంటే నాకవితాధారయె స్ర్మృతిగా నీకింకేమివ్వగలను? నేత నసలు కాకపోతి ఆసరాగ నిలువకుంటి ఆశువుగా జెప్పు కవిత నీ ఆకలి తీర్చదే అయినా నీకేం తెలుసు అక్షరానికున్న విలువ అక్షరమే ఆయుధమై ఉద్యమానికూతంగా నిలుస్తుందని, జాలిగుండె జలధారయై మహోజ్వలపు ఉప్పెనయై సాగుతుందని, జాలి లేని నేతలంత మరుగున బడిపోతే మరో జ్వలితగీతం క్రొత్త వెలుగు నిలుస్తుందని...             *********                          --------యెనిశెట్టి గంగా ప్రసాద్..

మన ఆర్టీసీ!(కవిత)

మన ఆర్టీసీ!(కవిత) **************** ఏలినవారికేంతెలుసు ఏపాట్లైనా పేదోడికే తెలుసు విభజించి పాలించడం విజ్ఞులకే తెలుసు విజ్ఞత లేని వెఱ్ఱి  నాగన్నకేంతెలుసు అందుకే తెలంగాణ వాదానికూతమిచ్చిన్రు సకలజనులసమ్మెకూతమిచ్చిన్రు ముందుండి సైరన్ మ్రోగించిండ్రు హామీల గుప్పించి వెన్ను దట్టిండు సెల్ఫౌటంటు వెన్ను బొడిచిండు విభజించి పాలించడం విజ్ఞులకే తెలుసు విజ్ఞత లేని వెఱ్ఱి నాగన్నకేంతెలుసు? నలుబది మూడడిగితే నలుబది నాలుగిచ్చిండు నష్టాలు వచ్చెనని ప్రైవేటు కిచ్చిండు అప్పు గట్టలేక ప్రైవేటు కిచ్చునా ప్రభుత నప్పగించి ప్రజలకు బానిసత్వమ్మునే బహుమతిగ నిచ్చునా! ఏమెరుగని పేదోడు యెర్రిబాగులోడు రోజు కూలికి బస్సునడిపెదనంటు లైనులో నిలబడే, ముందరున్న బ్రతుకు తనదికాదనుకొనే! ఈనాటి బాధితుడు ఆర్టీసి వోడు రేపటి బాధితుడవు నీవు కావా! పేదోడికి పేదోడే శత్రువైతే ఆ పేదోడికి పెన్నిదేదీ? సబ్సిడీ లిచ్చు పాలకుడా నీ సబ్సిడీ బాకిదీర్చుముందర అందుకో లాభాలను  విలీనం చేసి చూపు  విజ్ఞతను పెంచుకో వివేకుడిగ మసలుకో పాలాభిషేకాలందుకో! ఆర్టీసీ అందరిదీ,మీదీ,మాదీ,మనది!!               ***********   ...

ఆర్టీసీ ఉద్యమ కవిత

గుప్పెడు వనరులతో గంపెడు సమస్యలు కోరి తెచ్చుకున్న పాపం పదవి పిచ్చి తగిలించిన శాపం! మిగులు బోయి అప్పు వచ్చె తీర్చే దా చచ్చేదా ఉన్నన్నాల్లు ఊడ్చేద్దాం తెచ్చేది మనం తీర్చేది మరొకడు చేసిన సాయం మరువని ప్రజలు విగ్రహాల తో సన్మానం తరగని అప్పును తీర్చమంటే తలా పిడికెడు శాపాలే!!             *********

ఆర్టీసీ.....!(ఉద్యమ గీతం)-2

ఆర్టీసీ....!(ఉద్యమ గీతం)--2 ************************ ముందుతరాలకు మార్గదర్శివై  ముందుకు నడువర సోదరా! మునుముందుకు నడువర సోదరా!  తరతరాలుగా నినుతలచెడు రీతిగ సాగరా! ఐకమత్యముతొ ఒక్కటయ్యితే నీదే విజయమని యెంచరా! నిజాయితీ గా ముందుకు నడువు నీతీ నియమం వీడకయుండూ నిరసనతెలుపగ అనుమతెందుకూ అవనిలొ అందరి హక్కూ! హింసా మార్గం వద్దూ! అహింసా మార్గమున నడువూ! విజయం నీదే నీదే!             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఆర్టీసీ....!(ఉద్యమ గీతం)

ఆర్టీసీ....!(ఉద్యమ గీతం) *********************** రాతిని నాతిగ మార్చిన రాముడుండెనాడు ఈ రాతిని కరిగించగ యేరాముండీనాడు ఒకడు తప్పుజేయజూపి,తాను తప్పుజేయదలచె ఘనుడెవడు,దుర్జనుడెవడు తెలుసుకోండి మీరు.   !! రాతిని!! కేంద్రము ప్రైవేటు జేయు రైళ్ళనాప శక్తి లేక ఆర్టీసిని ప్రైవేటు జేయనెంచె నేడు విజ్ఞుడెవడు విబుధుడెవడు స్వచ్ఛులెవరు,మ్లేచ్ఛులెవరు.  !! రాతిని!! యజ్ఞాలు యాగాలు జేయ ఫలితమిదేనా ఎవరి బాగుకొరకు,యాగఫలితమెవరికొరకు? ఉద్యోగులు మనుషులని యెంచలేవ నేతా! పథకాలు పొందినట్టి ప్రజలేనా నేతా!  !! రాతిని!! గద్దెనెక్కినట్టి నేతలే రాజు లందురుగద రాజు యనినరాముండే రామరాజ్యమేదీ? రామయనిన,రాజుమహిమయనియెరుగవా? ప్రజాసేవయే మా కర్తవ్యమ్మని రానాడు నేటి దాక జీవితాల ధార బోసినారు. !! రాతిని!! రిటైరైన వారి కెంత పెన్షనిచ్చి నావూ తెలిసుండీ మౌనముద్ర యేలనయ్యనీకూ ప్రభుత్వమ్ములోన విలీనమ్ముజేయుమంటూ కోరిన కోరిక సబబని నీవెంచూ నష్టాలనిబొంకి ప్రైవేటును బూచి జూపి ప్రజల మభ్యబెట్టనెంచి ఎన్నాళ్ళుగ యీతీరుగ రాజ్యమేలగలవు!! రాతిని!! సకల జనులు జెప్పవట్రి మద్దతీయ ముందుకొచ్చి తగదు తగదు తగదు నీకు తగదు పాలకుండా యీతీరు నీకు యేమాత్ర...

ఆర్టీసీ సోదరా (ఉద్యమ గీతం)

ఆర్టీసీ సోదరా (ఉద్యమ గీతం) ************************** లెమ్ము లెమ్ము సోదరా ఆర్టీసీ సోదరా అండనీకుండగా అధైర్యంవలదురా సమ్మె మనహక్కురా ససైన్యంగనడువరా సమైక్యంగ ఉంటేమరి సాధించగ లేనిదేది ప్రభుత్వంలొ భాగమై లాభాలబాట నడుపగలవు విజ్ఞత నే పొందెదవు ఉద్యోగపు భద్రత మనిషి హక్కు సోదరా ప్రజల కొరకు నీవు నీ కొరకే ప్రజలురా మీరందరు కలిస్తే ప్రభుత్వాలె మారురా అదే తెలియజేయగా దిగరాకతప్పదురా పాలకులూ,పరిపాలకులూ దిగిరాక తప్పదూ!           ******            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

తలా పిడికెడు శాపాలే!(కవిత)

తలా పిడికెడు శాపాలే!(కవిత) ************************** పులింజూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మహాత్మున్నవ్వాలని,మన్నికైన దుస్తుల విడిచినట్లు కోయిలలా పాడాలని,కాకి అరిచి నట్లు సాధన లేని పనులు లక్ష్యాన్నెంచక లెక్కకు మిక్కిలి సమస్యల నెత్తి కెత్తుకుంటే వనరుల లెక్క కుదరక, వాస్తు ప్రపంచాన్ని తిరగేసి వాస్తవ ప్రపంచాన్ని చూడలేక ఊహల్లో బ్రతుకుతూంటే ఎన్నాళ్ళకీ సమస్యలు సమసిపోయేను అప్పులోళ్ళు పీడిస్తుంటే పన్నులమీద పన్నులేసినప్పుడు తలా పిడికెడు శాపాలే!!                 *******           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

శాపాలే!(కవిత)

శాపాలే!(కవిత) ************** పట్టెడన్నం కొరకు పుట్టెడు పాట్లాయె పట్టువిడుపులేని బ్రతుకు లాయె!! బ్రతుకు భారమవగ సమ్మె తప్పదాయె సమ్మెయనగ మాకుసమ్మెట పోటాయె మిగులవట్టె మిక్కిలి వేదనలే మాకు ఎన్ని నాళ్ళదాక దొరతనమ్ము? సమ్మె అసమ్మతము, హక్కు లేదంటు హుంకరించుటేల?ముఖ్యవర్య! ఆర్టీసి అందరిదీ,అందరిలో మేమొకరం ఎరుగకుంటె యెలా?ముందుతరాలకు ముఖ్యవర్యుడవని అంటారే! ఎలా సాధ్యం?యేదినిజం? అందరినీ కలుపుకు పోతే కాదేదీ అసాధ్యం? కాకుంటే మిగిలేదీ యెవరికైన తలా పిడికెడు శాపాలే!             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

మేమెవరం?(కవిత)

          మేమెవరం?            ********** భరతజాతిబిడ్డలం భావి భారతీయులం మీ దీపకళికలం కోటి దివ్వె వెలుగులం చదువుకునే పిల్లలం పనులు నేర్చు మొల్లలం ఊడిగాలు చేయబోం వెట్టి పనికి లొంగబోం నేర్చు కొనుట మా హక్కు నేర్పించుట మీ ధర్మం కన్నకడుపు మీదైతే కనిపెంచుట మీధర్మం కొనుక్కున్న చదువులొద్దు కోరుకున్న చదువు ముద్దు సంస్కారం సౌశీల్యం సమానత్వ మనువాదం ఎల్లప్పుడు అనుసరణీయం                    * బాలశాస్త్రవేత్త లంట బహు బాగుగ వెలిగినారు ఏమెదడున నేమున్నదొ ఈ చిన్న బుర్రకేమితెలుసు ఎప్పుడెవరు వెలిగెదరో ఎవరి కేమి తెలుసు? అబ్దుల్ కలాం గారు ఆనాడనుకున్నడా శాస్త్రవేత నైపోతా ఈ దేశపు రాజు నైత అనుకోలేదన్నెడూ జనం మధ్యబుట్టి పెరిగి జనం నేత అయ్యాడు పిల్లలంటే ప్రేమయ్యీ పిల్లల్లో తిరిగాడూ పిల్లల్లో కొలువయ్యీ తనువును చాలించాడూ నింగి కెగసి తారకయై  తళతళ మెరుస్తున్నాడు నాటికీ నేటికీ యేనాటికైన మనకతడే ఆదర్శం మనకతడే ఆదర్శం!!           *******           --------యెనిశెట్టి గ...

కవిత్వమా...!(కవిత)

            కవిత్వమా.‌..!             ************ కవిత్వపు పొరలుగమ్మి కార్యసాధన శూన్యమయ్యే వర్ణణాత్మక రచనజేసి వాస్తవాలే మరుగునబడె దారిదప్పిన బాటసారీ గమ్యమెరుగని గడుసరీ యెచటకోయీ నీ పయనం యెందాకా నీ పర్వం కళ్ళు విప్పీ లోకంచూడూ కరుణ జూపీ కథనం వెతుకూ కంటి కాటుకవై కన్నీటి ధారలవై ప్రవాహపు పొంగులో సేదదీరే నేస్తమా కళ్ళు తెరచీ చూడవోయీ వాస్తవాల గమనించవోయీ! జరుగుతున్నది మారణ హోమం మాడుతున్నది మానవ శలభం!             --------యెనిశెట్టి గంగా ప్రసాద్..

శుభం భూయాత్!(కవిత)

        శుభం భూయాత్!!          *************** ఆశగలవారెప్పుడైనను  ఆశపెట్టుదురయ్య వినుడు కొత్త వత్సర మంచుజెప్పి  సంతసానికి మందుబోసి రోగకారక ద్రవము వొంట్లో కిక్కు కోసం మితంమించి వొంటి మీద స్ప్రుహనె మరిచి చేయగూడని పనులజేసి కొత్తవత్సర కోటి శోభల  తృంచ బోకు బుద్ది జీవివె                 *** అర్ధరాత్రి అటలొద్దు పూటుగ తాగినీవు శుభాకాంక్షల జెప్ప బోకు భారతీయ సంస్కృతి కది భవ్యచరిత కాబోదు జనవరి ఒకటనగా జనం మెచ్చురోజే యది కాని,జాగరణలు చేయబోకు జాతరోలే యెగరబోకు పబ్బులెంట తిరుగబోకు                *** కేకు కోసి చెబితె చాలు శుభాకాంక్షలూ షడ్రుచుల భోజనాలు ఆరోగ్యపుటాచారం! ఏదేశపు పండగైన ఆచరణలు ఒకటే అదే భారతీయ నాగరికపు సంస్కృతి,సంరంభాలకు నిలయమదీ! వినుకున్న అదే భావి విజయాలకు మూలమదీ!! అందుకోండి శుభాకాంక్షలం దుకోండిమీరూ! ఆనందం మీ వెంటే యెరిగి మసలుకోండీ!!               ***         --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

సత్కారం!(కవిత)

             సత్కారం!              ********* గతం గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తోంది వర్తమానం వెర్రిగా నవ్వేస్తోంది భవిష్యత్ భయపెట్టి భగ్గుమంటోంది కాలం వికటాట్టహాసం చేసి కవ్విస్తోంది కాలజ్ఞానం నిజమని ఘోషిస్తోంటే ఒకటొకటిగా విష్లేషిస్తూన్నవేళ ఓ మనిషీ కళ్ళు తెరిచి చూడు కర్తవ్యం కళ్ళముందు కదలాడ్డం లేదా నాయకత్వం కోసం వెంపర్లాడి విమర్షే పరమావధిగా విజ్ఞత మరిచిన మానవతా వాదివై పదివికోసం ప్రాకులాడాటమేనా తాయిలాల కంపులో తలతాకట్టు పెట్టి  పెట్టుబడి పంచడమేనా నీపని? పసలేని ఫలితాలు ప్రజల ఘోష పట్టని పురాణ కాలక్షేపాలు! హెచ్చరికలు ఆపదలనాదుకోని ఆలంబనలు సుభాషితాలు సుఖజీవన సుప్రభాతాలు భోగలాలస తార్కాణాలు చట్టాలు చుట్టకంపు వాసనలై ఆర్తులకందనంత దూరంగా ఆశావహుల అవకాశ పందిల్లై డబ్బుజీవుల డప్పు కొడుతుంటే విజ్ఞులు విక్రమార్క కథల్లోని భేతాలుడిలా పరీక్షిస్తూంటే, అక్రమార్కులు రాజ్యమేలి రంగుల కలల్లోఆశల విరులను పూయిస్తూంటే కథల్లో రాకుమారుల్లా కలలుకంటూ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే నాయకజనం నేటికైనా మారి క్రొత్త వత్సరానికి క్రొంగొత్త రుచులగ్రోలి పండుగ ...

వినతి!(పాట)

                వినతి                 ****** మహిళ మనసెరిగి మది దోచుకొను వాడె ఘనుడూ ఆమనసే విరిగి మరులు గొనని వాడె వ్యర్థుడూ!         !మహిళ! నీవు నేనొకటియే మనము  మన మాటన్న మగవాడె ఘనుడూ! నీవెవరొ నేనెవరొ యని నయవంచనల్ జేయు వ్యర్థుడూ!  !మహిళ! ఆడబ్రతుకన్న అధారబడుటన్న అలవిగానీ మాట వినుడూ(తమ్ముడూ)! ఒకరిమీదొకరు సహకరించుటన్న మేలైన మాటయగు వినుడూ!  !మహిళ! అహము వీడి మనము మనమంత ఒకటియే అనుడూ! నేను జెప్పెడు మాట మొండిగా నిజమని పలుకబోకుమెపుడు వినుడూ!                                            !మహిళ! ఒకరు జెప్పిన విషయమే రీతి ఘనమగునొ విడమర్చి చర్చించ మేలైన విషయమే వినుడూ! మొండిగా వినుమనీ వినకున్న చూడుమని కళ్ళురిమి చూడకూ యెపుడూ!  !మహిళ! చిరునవ్వుతో జెప్ప దరహాసమును విడక విడమరచి మాటాడ మర్యాద విడ బోకు మెపుడూ! ఆడదనిన యెవరు ఆదిశక్తని యెరుగు కార్యాచరణమున మంత్రిగా వ్యవహరించు యెపుడు !మహ...

జయహో మహిళా!(పాట)

శీర్షిక:   జయహో మహిళా! కవి పేరు:  యెనిశెట్టి గంగా ప్రసాద్. వీర మాతలు వీరపత్నులు వీర వనితలు యెందరో నిలిచినారు చరిత్రయందు కోటివెలుగుల కాంతితో! కాకతీయుల రుద్రమ కదిలి వచ్చిన కనకదుర్గయె ఝాన్సిరాణి పోరు సల్పిన భరత ఖండపు ఆణిముత్యం! కవుల కలమున నిలిచినట్టీ కథానాయిక మొల్లయే రామ కావ్యం వ్రాసి నిలిచెను కవన వనమున మణి పూసయై ఉద్యమించెను స్త్రీ విద్యకు శంఖమూదె సావిత్రి భాయీ!  దుర్గయై కదిలింది నాడూ దుర్గా బాయీ దేశ్ ముఖ్! కదిలి నారూ నేడుయెందరో మహిళా మణులు కదిలిరీ! అన్ని రంగములాక్రమించీ అభివృద్ధి పథమున నిలచుచుండిరి! జయహో మహిళా జయం నీకు జయం! నాడు నీవే నేడు నీవే రేపు నీవే రాబోవు తరం నీదెలే!!               ********

నిప్పు కణిక/సంవాదం (కవిత)

నిప్పు కణిక (సంవాదం)              ******************** మండుతున్న నిప్పు కణిక "మరో!"అంటుంది మందేది నన్నేమీ చేయలేదంటోంది ఎందుకంటే నేను నిప్పు కణిక ను! మందుకు దొరకను,మాకుకులొంగను గాలికి కొట్టుకుపోను,నేనే గాలి ని మండే గాలిని, మహమ్మారిని మురికి లోంచి పుట్టలేదు మురికి గుంటల్లో కి పడదోస్తాను!                         * మిత్రమా! దొరికినవులే మురికి గుంటలే లేకుంటే పడదోసే దెవరినీ పడిపోయేదెవరు? పారిపో మిత్రమా! పడిలేచే కెరటంలా వెళ్ళిపో! వెనక్కు కదిలి పో కనుమరుగున ఉండిపో!                          * కదిలి పోవుటెక్కడికీ? వెనకడుగే లేదు నాకు వేసిన ప్రతి అడుగు ముందుకే భౌతిక దూరం లేక,బహుళ జనులు సాగలేరు జనుల దేహమే నాకు ఆవాసం మీ గుండె గొంతుకలోనే నా నివాసం జారిపోతె చేరుదు, నీ శ్వాసకోశ నాళంలో నాట్య...
పదవీ వ్యామోహం పరవల్లు తొక్కుతోంటే ప్రతి పక్షం వహించి విమర్శిస్తూ నే ఉంటం పరిష్కారం చెప్పకుండా బాధితుల పరామర్శిస్తూ నే ఉంటం వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా వ్రాస్తూనే ఉంటం వర్గవిభజనకు మార్గాలు వెదుకుతూనే ఉంటం సమన్వయాన్ని సమాధి చేస్తూనే ఉంటం అందుకే ప్రభుత్వం ఫేలయితే ప్రజలూ ఫేలయినట్టే!!                      ******              --------యెనిశెట్టి గంగా ప్రసాద్

నిశ్శబ్ద సవ్వడి!(కవిత)

             నిశ్శబ్ద సవ్వడి!              ************** రెక్క విప్పిన రెవెల్యూషన్ తెచ్చిన స్వేచ్ఛ నేటికీ రెప రెపలాడుతూనే ఉంది డెబ్బది మూడేళ్ల నుండి, పురివిప్పిన ప్రజాస్వామ్యం పోకడ పరిఢవిల్లుతూనే ఉంది నేటికీ! పదితలల రావణుడికైనా భయపడని రామచంద్రులు తలలు వంచి పాదాక్రాంతం చేస్తున్నరు నేడు రెప రెప లాడే జెండాలు రేపటి స్వాతంత్ర్య దినాన ఎగిరి నా ఆనాటి సంబరాలు గతకాలపు స్మృతుల్లా మిగిలిపోనున్నట్లే కళ కళలాడే పిల్లల ముఖాలు తీపి బిల్లలకైనా నోచుకుంటాయో లేదో ఆటలు అటకెక్కె, పాటలు పాతజ్ఞాపకాలయ్యె పతాకానికి వందనం చేయడానికైనా సామాజిక దూరం అడ్డు వచ్చే నింగి నంటే నినాదాల చప్పుళ్లు తెరవేసిన నాటకంలా మిగిలిపోవునేమో ప్రభాత, ప్రభోదగీతాల సవ్వడులు నిశ్శబ్ద గీతాలై నిండు నూరేళ్ళు జీవించాలన్న జిజ్ఞాస లో కలిసి పోతాయేమో! కంటికి కనిపించని కణమా ఎంతపని చేశావే! ఏడని వెదకను నిన్ను! ఏం చేయగలను? నాసమాజపు రేపటి పౌరులకేమని చెప్పను?             ...

ఆటగదరా!(పాట)

ఆటగదరా!(పాట) **************** ఆటగద కవివరా! ఆటగద     నీకు ఆటగద కవివరా అక్షరాల  తొనీకు  ఆటగదరా! అక్షరాల తో ఆడి పాటవై  ప్రవహించి  పల్లవి తొ  ప్రజలనే  ఉర్రూత  లూగించ  ఆటగద  కవివరా  ఆటగదరా!!  ఆది శంకరు   నిన్ను   ఆవహించగ        నీవు   ఆటాడుకొందువూ     ఆటగదరా          కవీ      ఆటగదరా!!             .....    ---యెనిశెట్టి గంగా ప్రసాద్. Nav.16, 2018.

ఆశల హరివిల్లు!(కవిత)

*ఆశల హరివిల్లు*   ************** మబ్బు పట్టిన ఆకాశం కన్నీరు కార్చడానికి సిద్ధంగా ఉంది ఆ కన్నీటి బాష్పాలు వరదై ప్రవహించిన ప్రవాహం లో కొట్టుకు పోతున్న జనాన్ని చూసి ఆకాశం నవ్వుతోంది ప్రశాంతంగా సేదదీరుతోంది రంగుల హరివిల్లును పూయిస్తోంది! తడి యారిన నేల ధవళవస్త్రం ధరించి నింగితో దోస్తీ చేస్తోంది! కొట్టుకు పోయిన జనం కోసం మిగిలిపోయిన శోకతప్త హృదయాలు సానుభూతి కోసం అల్లాడుతున్నయ్! అందించిన ఆపన్నహస్తం కంటితుడుపు చర్యల్లో భాగమై బాధలు, బంధాలకు దూరమై భావి తరాలకు మార్గదర్షకమై రానున్న కాలానికి ఏదో చిన్న ఆశ.... కంటికి వెలుగు దివ్వెయై మార్గ దర్శనం చేస్తుందేమో నన్న ఆరాటం బ్రతుకును వెళ్ళదీస్తున్న తరానికి కొండంత అండగా నిలువాలన్న ఆశ నన్ను నడిపిస్తోందిన్నాళ్ళు.....!                    *****           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఇంకెన్నాళ్ళో...!(కవిత)

                   ఇంకెన్నాళ్ళో...! *********** రక్తపు టేరుటులు పారించకుండానే మౌనంగా రోదిస్తున్న కళ్ళు యుద్దాన్ని చూస్తూనే ఉన్నయ్! పోరాటం ఎవరు చేస్తున్నారో ఎవరితో చేస్తున్నారో... కత్తులు కటారులు లేవు కరవాలపు చప్పుళ్ళు లేవు యుధ్ధమేఘాలు కనిపించవు అయినా యుద్ధం జరుగుతోంది ఎవరికి ఎవరు శత్రువో తెల్యదు అయినా పోరాటం సాగుతూనే ఉంది చచ్చిన శవాలు ముట్టుకోడానికే భయం దహనసంస్కారం నిరాడంబరం మౌన రోదనలూ, మానసిక నిర్లిప్తత చావులసంఖ్య తక్కువే అయినా క్షతగాత్రుల మానసిక ఆందోళనే ఎక్కువ పెరుగుతున్న సామాజిక దూరం తరుగుతున్న మానవత్వం కనబడని శత్రువు చేస్తున్న మారణహోమం ఎన్నాళ్ళో ఇంకెన్నాళ్ళో....!                   ******            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

వ్యంజకాలు!

వ్యంజకాలు!              ***********  1. కూలీ చేసుకుని బ్రతుకుతున్న ఉపాధ్యాయులని పోస్ట్ పెట్టిన యాజమాన్యం తనవారికే జీతాలివ్వని వైనం! 2. భౌతిక దూరం పాటించాలని చెప్పిన పెద్దలు ఫోటో కోసం ఆ దూరాన్ని ప్రక్కన బెట్టిన వైనం! 3. ఫోటో కోసం జాగ్రత్తలు ప్రక్కన బెట్టారు ఫోటో కోసం జాగ్రత్తగా కరోనా దూరింది! 4. చదువు బాగా జెప్పండన్నాడు తండ్రి తెల్లవారింది మొదలు వరుసగా పదిరోజుల పాటు బడికి పంపలేదు. 5. మా నాన్న స్మార్ట్ ఫోన్ లో రోజూ వాట్సాప్ ఫేస్ బుక్ చూస్తుంటాడు. ఆన్ లైన్ పాఠాలనగానే పదివేలు బెట్టి ఫోనెక్కడ కొనియ్యాలె అన్నాడు!                       *******                       --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

వలస కార్మికులు (కవిత)

అంశం: వలస కార్మికులు          శీర్షిక: వలసల వ్యవస్థ!                   ************** కలంపట్టని యోధులు కరవాలం పట్టని వీరులు బ్రతుకు తెరువెరుగని బాటసారులు అవిచ్ఛిన్నంగా పయనం ఎల్లలెరుగని ప్రయాణం మమకారపు విలువలకన్నా అనురాగపు అడ్డుగోడల్ని చీల్చుకొని అలుపెరుగని బాటసారి యై బ్రతుకు చట్రంలో ని బాద్యతల బంధాలను అధిగమించడానికి చేసే ప్రయత్నం! ఎందాకా! రాష్ట్రాలు మారినా, దేశాలు మారినా ఎప్పటికైనా నీ మమకారాల అనుబంధం అజరామరం! ఏనాడూ తెగని అనుబంధం                         ఎండ వానెరుగని జీవులు ఉపాధి గలచోటే వారి ఊపిరి మనిషెక్కడున్నా, మనసు మమకారపు బంధాల్లోనే! ఆత్మీయుల అనురాపు ఊపిరిలోనే!                         కాలం కలిసి రాక కలకలం రేపిన ...

సహృదయ స్పందన!(కవిత)

             సహృదయ స్పందన               ***************** నింగి నేలను తాకిన నిప్పురవ్వ నీడనిచ్చే చెట్టునే కాల్చినప్పుడు, గర్జించిన మేఘం  నిర్జీవమై నీరుగార్చినప్పుడు ధ్వని తరంగం అంతరంగాన్ని తొలిచేస్తూ వరద యేరులై పొంగి పొర్లి పోతుంటే కొట్టుకు పోయిన గుట్టలు గుండెలవిసేలా రోదిస్తూ కోటి గొంతుకలు గొంతెత్తి చేసిన ఆర్తనాదం అందని సాయం కోసం అర్రులు చాస్తుంటే ద్రవించిన హృదయ స్పందనలకు సలాము చేద్దాం!              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

అలసి పోని పలకరింపు!(కవిత)

          అలసి పోని పలకరింపు!! ****************** కొరుకులు బడ్డ చొక్కాలాగ కొత్తపుంతలు తొక్కుతోంది కవిత్వం! పురస్కారాల పైత్యం ప్రకోపించి ఏదారిన వెల్లనున్నదో... సహస్ర,శతసహస్ర కవి సమ్మేళనాలు శాస్ర్తీయతను లెక్కించే తీరిక లేదు! ఆన్లైన్ అవధానం అందుకోలేని ఎత్తుకెదిగి పాప ప్రక్షాళనం చేసుకుంటోంది బిరుదుల విందుభోజనం అంగట్లో సరుకయ్యింది! వ్యాపార, వ్యవహారాల సంతలో వేలం పాట కు నెలవయ్యింది కాలానికి గాలం వేసి కరోనా విజృంభించి కవన కుతూహలాన్ని రేకెత్తించింది వ్రాత లో పస పోయింది తలరాత మారిపోయింది! సన్మానాల శాలువాలు బరువైపోయినయ్ లేవనెత్తే వాళ్ళుంటే బాగుండు! పురస్కారాల అల్బం అందంగా రంగు రంగు లతో మెరుస్తూ కోరికల సాఫల్యత వెన్ను తట్టి గుర్తు చేస్తూనే ఉంది! ప్రతి రోజూ అద్దాల బీరువా లో ఉదయాన్నే నన్ను పలకరిస్తూ నే ఉంటుంది! నా కలం అలసి పోవద్దని హెచ్చరింపుగా...!!                         *******              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఎవరు ప్రజలు?(కవిత)

ఎవరు ప్రజలు? ************** సామంతరాజుల సఖ్యత చక్రవర్తుల తలబొప్పి కట్టిందా! నిరసన ప్రజలు, ప్రభుత్వం మధ్యనో పాలకులు,పాలకుల మధ్యనో తెలియకున్నది కండువా కప్పుకున్నోల్లంతా పాలక వర్గం లో భాగమే పాలక వర్గం అంటే ఒక పార్టీ యే పార్టీ జెండాను మోసే మనిషి ప్రజల వాక్యమనుకోలేము అసలైన ప్రజలు పాలకులనర్థిస్తారే తప్ప పాలకులనెండగట్టరు! భరిస్తారు! బాధపడతారు! జ్వాలలెగయని నిరసన వెలిబుచ్చుతారు! వారే నిజమైన ప్రజలు....                   *****               --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఆత్మావలోకనం!(కవిత)

ఆత్మావలోకనం! ************** మెచ్చని పేపరోళ్ళనుజూసి మనిషి దిగాలు పడ్డడు దీనంగా ఉన్నమొగాన్ని జూసి ధనం ఆశ జూపి కవితరాయిచ్చుకున్నడు కొత్త ప్రక్రియంటూ కూచున్న చోట పంపిస్తే బిరదిచ్చి, ప్రశంసాపత్రం పంపిస్తన్రు! సాహిత్య సేవంటూ సంఘాలు బెట్టి కొత్త కవిత్వాలు కొల్లలుగా సృష్టిస్తున్రు! కవిత్వమే మో గానీ పైత్యం ముదిరి అదేపనిగా వ్రాసి కాగితాలు నల్లగైతున్నయి కవుల కళ్ళు బైర్లుగమ్ముతున్నై! కార్యశాలలేంజేస్తయి?  మల్లెపందిరి వద్దకు మనసును తెస్తయా? ఆ మల్లెల గుభాలింపులు మనసుకు తట్టాలె తట్టిన మనసు కలంపట్టి వ్రాయగలగాలె వ్రాసిన దాంట్లో పట్టుండాలె వ్రాయడమే ముఖ్యమైతే ఎవరైనా వ్రాయొచ్చు,ఎన్నైనావ్రాయొచ్చు వ్రాసిన దాంట్లో భాష ముఖ్యం భావం ముఖ్యం! అది వొసగే సందేశం ముఖ్యం! సమాజానికుపయోగపడటం ముఖ్యం!! బిరుదులు మన పేరును దూరం చేస్తాయి ప్రశంసాప్రత్రాలు మనను ప్రశ్నిస్తుంటాయి! ఆత్మావలోకనం చేసుకోమని! నిన్ను నీవు ప్రక్షాళన చేసుకోమని!                  *******                 --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

విమర్శకుడు!(కవిత)

విమర్శకుడు! *********** విమర్ష విరుగుడు మంత్రంలాంటిది విషపుగుళికలా అనిపించినా రసగుళికలాంటిదే! తప్పులసరిదిద్దుకోవడమనే రసాయనిక క్రియకు మందై ప్రశంసల పొరను క్రమ్మేసి సానబెట్టిన వజ్రంలా ప్రకాశింపజేసే కవితలు జాలువారుతాయి! అందుకే విమర్షకుడు విరుగుడు మంత్రం లాంటివాడు స్వీకరింపదగిన ఆదరణీయుడు ఏమంటారూ....!              *****                --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

ఉద్యమ వీరుడా!(కవిత)

           ఉద్యమ వీరుడా!! ************** అంతటోడు ఇంతటోడు రైతంటూ చెబుతావు రైతు గోస చూడవేందిరో! ఓ రయ్యొ నీవు రైతు బాధ వినవేందిరో!   !!అంతటోడు!! చట్టాలు చేస్తావు పక్కవేస్తినంటావు! చుట్టమోలె చూస్తనంటుపట్టు వీడకుంటావు!          !!అంతటోడు!! పరిపాలనలో నీకు పూలబాట పరిస్తంటు కల్లబొల్లి మాటలతో కబుర్లెన్నొ చెబుతావు ఆ బాట లోని ముళ్ళ కంపనెరుగకుండ ఉంటావు!   !!అంతటోడు!! చట్టమంటు జేయగానె సంక్షేమం కూరదయ్య లొసుగులేవొ జూడనెరుగ సవరించుట ముఖ్యమయ్య! !!అంతటోడు!! రైతే రాజంటావు రాజరికం కానరాదు పర్యవేక్షణ కొరవడితే పరితాపం తప్పబోదు!!        !!అంతటోడు!! సవరణలు చేయకుండ సత్వరన్యాయం జరుగబోదు సహకారం లేకుండ సరి న్యాయం జరుగబోదురో!! !!అంతటోడు! ఉద్యమాలు ఊపందితె దిగిరాకతప్ప దయ్య న్యాయం నడిబొడ్డు నుండి ప్రశ్నిస్తూ నిలిచిందీ!!           !!అంతటోడు!! జయహో! ఉద్యమ వీరుడా! జయహో.....! నిజం నిగ్గుదేల్చుదాక పోరాడీ గెలువవోయ్ జయహో! ఉద్యమ ...

అక్క కోసం/తపన(కవిత)

      అక్క కోసం!(తపన) ************** అక్కా బావెక్కడో ఆనందం అక్కడే బావ ప్రక్క కలిసి నడువ పరువు నిలుచు నప్పుడే! నీవెరుగని దానవా... నేను జెప్పదగునా! కోపం కాసింత శృంగారం కొండంత సముద్రాన అలలవోలె నిలువదులే క్రోధం నిలువెత్తున నిలిచిన నీ బంగరు రూపం కొట్టవచ్చినట్టున్న నీ కోమలత్వ రూపం చిరునవ్వుల చిందులేసె ముగ్ధమోహనత్వం! అందమైన రూపానికి అమాయకత్వ లక్షణం! అదే నీకు అమరినట్టి అలంకార భూషణం!!        !! అక్కా!!             *****              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

అదృశ్య కదలిక! (కవిత)

అదృశ్య కదలిక! *************** నిరసన గళం నింగి కెగిసేదాక నిండు కుండ యెపుడు తొణికియుండే దాక వేచి యుండవలదు నివురు గప్పిన నిప్పు తోసుకొచ్చినపుడు అగ్ని జ్వాలలు దెచ్చు ఆర్తనాదాలు అపభ్రంశపు సంకేతాలు ఆత్మహత్యలు కూల్చేగోడల పునాదులు ఆది లోన తృంచేసే ప్రయత్నం ఆర్తుల కనందకరమగు సోపానం అణచివేత ఆపద్ధర్మ ప్రయత్నమైనా అధికార పునాదుల కదలికకు సూచికే... అర్థం చేసుకుంటే అంతా కుశలమే లేకుంటే మనమింటికే...............!!              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.                                     కామారెడ్డి                        సెల్: 9866447234 .