జిల్లా కవి సమ్మేళనం!(కవిత)

జిల్లా కవి సమ్మేళనం!
******************
కవులు కవయిత్రుల
కలాల కదలికలు 
మ్రోగించె సమర శంఖం!
తెలుగు స్వరాల కమ్మదనం
తెలుగు భాష ప్రాచీనత
తెలయజెప్ప వేదికయై
గతకాలపు తరం 
తెలుగు కవుల గొప్పదనం
చాటి చెప్ప సమయమొచ్చిందని
తెలంగాణ ప్రభుత్వం 
బాధ్యతగా నెంచబూనె
విశ్వవ్యాప్తమొనర్చ నెంచి
ప్రపంచ తెలుగు మహాసభల కూర్చనెంచి
జిల్లా సభలో కవులకలాల కదిలింపజేసిరి నేడు
డిగ్రీకళాశాల వేదికగా
సమధికోత్సాహమ్మున
చేసిన కవుల కవితాగానం
మ్రోగె ఘంటారవమ్మై
వెలిగె తెలుగు ప్రభలు
విశ్వ వ్యాప్తమగునట్లుగ!
ధన్యజీవులార మీరు!
వందనాలభివందనాలు!!
                ....::::....

               --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)