ఏలిక (పద్య కవిత)
ఏలిక ***** ౧. ఉ.మా!! కాంచగ లేమె చిత్రమది కారణమెద్దియొ తెల్యనేరకన్ తెంచెడు బంధమేను పలుతీరుల చక్కగ మార్పులొందుచున్ పంచును రోగమొక్కటిగ బాధలుబెట్టుచు నుండు లోకులన్ వంచనలెన్నిజేసె కడు ప్రాభవమొందె కరోనయేలగన్!! ౨.ఉ.మా!! దారుణమయ్యెనేడు దరి దాపున నేరక నుండబోకుమా నీరుణ ముంచబోము మదినిండుగ నెప్పుడు మెప్పుజేయగన్ మారణహోమమౌను మరి మాన్యతవీడుచు తిర్గినంతనే కారణమౌటనిశ్ఛయము, గావున ద్రుంచుకరోన యేలగన్!! ౩. ఉ.మా!! ఆకలి దప్పులేల?అనువయ్యెడు ప్రాంతములందుకార్యముల్ చేకొని వెట్టియైన పని జేసెడు వారలు వీడివచ్చిరే కాకలు దీరినట్టి కడు కండలవీరులు భ్రాంతి నొందిరే యీకలు పీకుచుండె యిట యెంతటి వారె కరోన యేలగన్!! ౪.ఉ.మా!! భౌతిక దూరమంచు పరిపాలకు లెన్నివిధాల జెప్పినన్ చేతినికడ్గుకోవు దరి జేరును కీటక జీవు లెప్పుడున్ ఖ్యాతిగడింతువయ్య పలు ఖచ్చిత మయ్యెడు సూత్రముల్ వినన్ పాతకమౌను గాదె గన ప్రాభవ మొందు కరోనయేలగన్!! --------యెనిశెట్టి గంగా ప్రసాద్. ...