ప్రేయసి పరిణయం (కవిత)

           ప్రేయసి పరిణయం!
 **************
కలల రాణి పూబోణి
కరచాలనమును మాని
కరములు జోడించి జెప్పె
మాస్క్ వేసి దూరముననె
మాటనొకటి జెప్పవట్టె
మౌనంగా రోదించీ
మొహం చాటు వేయవట్టె
ముద్దు ముద్దు మాటలన్ని యేమాయెనొ
మురిపెంపు మనోలతలు
ఎటు వెడలెనొ?
చెప్పుకున్న ఊసులన్ని
చెరిగి పోయెనా!
చేసుకున్న బాసలన్ని వట్టిపోయెనా!
ఊహించుకున్న కలల లోకం
ఊపిరులే విడిచెనా!
వాట్సప్పుల చాటింగుల 
వరుసమారి పోయెనా!
ఎన్ని నాళ్ళొ ఎన్నేడులొ
ఈ జగాన ఇడుములు దప్పగ
నా ప్రేయసి కౌగిలి కలల
వీడి నిజమౌనో 
పరిణయాల పరిమళాలు
వెదజల్లుడు యెప్పుడో....!
              *
          --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)