శుభం భూయాత్!(కవిత)

        శుభం భూయాత్!!
         ***************
ఆశగలవారెప్పుడైనను 
ఆశపెట్టుదురయ్య వినుడు
కొత్త వత్సర మంచుజెప్పి 
సంతసానికి మందుబోసి
రోగకారక ద్రవము వొంట్లో
కిక్కు కోసం మితంమించి
వొంటి మీద స్ప్రుహనె మరిచి
చేయగూడని పనులజేసి
కొత్తవత్సర కోటి శోభల 
తృంచ బోకు బుద్ది జీవివె
                ***
అర్ధరాత్రి అటలొద్దు
పూటుగ తాగినీవు
శుభాకాంక్షల జెప్ప బోకు
భారతీయ సంస్కృతి కది
భవ్యచరిత కాబోదు
జనవరి ఒకటనగా
జనం మెచ్చురోజే యది
కాని,జాగరణలు చేయబోకు
జాతరోలే యెగరబోకు
పబ్బులెంట తిరుగబోకు
               ***
కేకు కోసి చెబితె చాలు
శుభాకాంక్షలూ
షడ్రుచుల భోజనాలు
ఆరోగ్యపుటాచారం!
ఏదేశపు పండగైన
ఆచరణలు ఒకటే
అదే భారతీయ నాగరికపు
సంస్కృతి,సంరంభాలకు
నిలయమదీ! వినుకున్న
అదే భావి విజయాలకు
మూలమదీ!!
అందుకోండి శుభాకాంక్షలం
దుకోండిమీరూ!
ఆనందం మీ వెంటే
యెరిగి మసలుకోండీ!!
              ***

        --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)