అన్ లాక్-1
అన్ లాక్ -1
**********
బిగిసిన పట్టు వదులవుతున్నది
వేయబోయే ప్రతి అడుగు
జాగరూకతను గుర్తు చేస్తోంది!
వేసిన వెనుకడుగు ముందుకే నంటోంది
వలసల కన్నీళ్ళు కంగారు పెడుతున్నవి
భయం ఇప్పుడు అలవాటయ్యింది
బాధల కన్నీళ్ళు బాధ్యతల గుర్తు చేస్తున్నవి
పడుతున్న పాట్లు పాదాక్రాంతమవుతున్నవి
పదవీ వ్యామోహం పరవల్లు తొక్కుతోంది
ఆగిపోయిన పదవుల పందేరం ఇంక చాలంటోంది
కార్పోరేట్లలో కదలిక మొదలయి నట్టుంది
కలిసి రాకుంటే కదలికలాగిపోతాయేమో!
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆదాయం
పాతాళం వైపు తొంగి చూస్తున్నట్టుంది
పోరాటం వదిలి రాజీకొచ్చినట్టుంది
లాక్ డౌన్ దిగివచ్చి అన్ లాక్ మొదలయ్యింది!
కాలం ఆగలేదు పోరు ముగియలేదు
కలిసి పోరాడటం కన్న విడిపోయి పోరుట మిన్న
విరచిత మైన ప్రణాళిక అందరికీ ఒకటే
పోరుబాట విధానమే వేరు!అదే మనకు మేలు!!
*****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి