తెలుగు భాషా వైభవం (పద్య కవితా)
తెలుగు భాషా వైభవం!
*******************
కం!!
ప్రాచీన కాలముననే
వీచెను నాభాష కావ్య వీవనలుధరన్
ప్రాచీన కవుల కవనమె
ప్రాచీనంబగు తెలుగిది ప్రాభవమొందెన్!!
కం!!
రాయలకాలము నందున
వ్రాయగ కావ్యమ్ములలరె వ్రాసిన వెన్నో
రాయల నాస్థానమ్మున
వ్రాయంగ తెలుగు కవిత్వ రమ్యత మెరిసెన్!
ఆ.వె!!
తెలుగు వాని నాడి తెలియంగ పద్యమై
వెలుగు చిందు నెపుడు వీడ దెపుడు
మధురమైన భాష మందార మొలికించు
తేనె లొలుకు నట్లు తీయ దనము!!
తే.గీ!!
నాడు నేడైన మనసుకు నాఁటునట్లు
వ్రాయుచున్నారు కావ్యముల్ భాసురముగ
అదిరె నవధానముల్ కవులలరు చుండ
కీర్తి చంద్రకల్ మిన్నంటె కేలుమోడ్తు!!
ఆ.వె!!
తెలుగు వైభవాన తెరపినిచ్చిరదేమొ
ఆంగ్ల బోధనమ్ము నరయు చుండె
పూర్వ వైభవమ్ము పునరంకితమవగ
ప్రీతి పాత్రమగును ప్రియము గలుగు!!
*******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి