పాపం! ప్రకృతి!(కవిత)

                 పాపం! ప్రకృతి     
                 *************  
ప్రకృతి మాత ఒడిలో సేదదీరుదామంటే 
ప్రకృతి ప్రశాంతంగా ఎక్కడుంది?
ప్రకృతిని పరిశుద్ధం చేయడానికి పూనుకొంది
ప్రకృతి లోని కాలుష్యాన్ని కడిగేయాలను కుంది
అందుకే ప్రజల్ని హోం క్వారంటైన్ చేసింది
                          *
హోం క్వారంటైన్ లో ఇమడని జనం
ఇబ్బడి ముబ్బడిగా తిరుగుతూనే ఉంటే
ఆర్థిక వ్యవస్థ పెట్టే ఇబ్బందులు
సామాజిక సంక్షేమం కకావికలం కాకూడదని
బాధ్యత పౌరులపై పెట్టింది!
గుర్తెరుగని జనప్రభంజనం
గుర్తెరిగినా రుచి మరిగిన బెబ్బులులు
గడపదాటి వస్తే, కనిపించని కరుకు చూపుల
కణం చేసిన కట్టడి ఫలితమే స్వచ్ఛంద బందు!
                          *
ప్రకృతి పరవశించింది కొన్నాళ్ళు గా
కాలుష్యం కంపు నుండి విముక్తనయ్యానని
ఇన్నాళ్లు గా అంటిన కంపును 
కడిగేసుకున్నాననుకుంది!
ఇన్నాళ్లు గా మోసిన భారం దింపుడు గల్లం
దగ్గరున్నాననుకుంది!
కానీ చిరంజీవి వరాన్ని పొంది 
పునరుజ్జీవం పోసుకుంటుందని
ఊహించలేదు! పాపం! ప్రకృతి!!
                        ***
              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)