నిజం తెలుసుకోవోయి (పాట)

అంశము: జీవ వైవిధ్య పరిరక్షణ
                  మానవ జాతి బాధ్యత.
    శీర్షిక:     
            నిజం తెలుసుకోవోయి!
           ********************
నీరు గారిపోకోయీ! నిజం తెలుసుకోవోయి!
నిక్కము గా మెరుగు పడును 
ఈ జగతిన కాలుష్యం!!
చెట్లు గొట్టకుండ నీవు అడవులనే పెంచవోయ్!
ప్లాస్టిక్కుల విరివిగాను వాడకుండ జూడవోయ్!              !! నీరు గారి!!
ప్రతి యింటికి వుండాలోయ్ ఒక యింకుడు గుంతా
ప్రతి యింటికి వుండాలోయ్ మరుగుదొడ్లు విడకా.                       !! నీరు గారి!!
రోడ్లమీద వుమ్మబోకు యెక్కడ బడితక్కడ
రైల్లు, బస్సు లోన వుమ్మ కాలుష్యం పెరుగూ
                                   !! నీరు గారి!!
వాహనాలు చక్కగా ను ఉంచుకొమ్ము సోదరా
పొగ గొట్టం పరిమళాలు చిందించకు సోదరా!                        !! నీరు గారి!!
వాహన కాలుష్యం ఊరికె అపకారం
రద్ది రోడ్లు పైన నడుప క్యాన్సర్ కే మూలమౌను
ఫ్యాక్టరీలు విడుచునట్టి వ్యర్థాలే ప్రమాదం
తగుచర్యల ననుసరించ తొలగును ఆ ఘోరం 
                                      !! నీరు గారి!!
మెరుగు పడిన ఓజోన్ పొర రక్షజేయు నిన్నూ
కాలుష్యం తగ్గించగ ప్రతిన బూన నీవు!!
                                       !! నీరు గారి!!

              --------యెనిశెట్టి గంగా ప్రసాద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)