అవిశ్రాంత సైనికుడు (కవిత)
అవిశ్రాంత సైనికుడు
****************
ఇన్నాళ్లు యెన్నో అగచాట్లు పడ్డావు
అందరిని ఇండ్లలో ఉండేట్టు చేశావు
కన్నతండ్రి వోలె కంటికి రెప్పలా
కాపాడుకున్నావు
కణజీవి బూచికీ వెరువకుండ వుండి
రహదారులన్నింట కాపలా కాశావు
మనిషికీ మనిషికి మధ్య దూరముండి
మసలునట్లుగ నీవు మనసుతో ఉంచావు
మద్యప్రియులు వచ్చి మధ్యలో జొరబడ,
మళ్ళి మొదటి కొచ్చి మరలి చూచునేమొ
మహమ్మారి మనుషుల కబలించి వేయునో...
రక్షకుడా దిగులెందుకు? నీవు రాల్చే కన్నీటి చుక్క
మందు బాబుల మందులో కలిసి గరళంలోకింకి పోతోంది
భౌతిక దూరం బేజారైపోగా రిత్తబోయి చూస్తున్న
నీ కళ్ళేచెబుతున్నయ్ అలసిన మనసుకు విశ్రాంతి లేదని....
పట్టువిడుపుల లాక్ డౌన్ లో చొచ్చుకు పోయే కాలనాగు
ఎవరిని కాటేస్తుందో........?
********
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి