పైలం (కవిత)

             పైలం!
             ******
పండుగ మనపబ్బులకెల్తె
కరోన తన కొరడా దీస్తది
మందు విందుతో నాట్యమాడితే
కరోనా కొరడా రాణిగ మార్తది
చెత్తతొ రోడ్డు కంగారైతే
కరోన నిన్ను పగసాధిస్తది
రైలు డబ్బలో పల్లీలొలిస్తె
కరోన వచ్చీ తాటదీస్తదీ
గుట్కలు పానులు నముల్తు నీవూ
ఎక్కడబడితే అక్కడ ఉమ్మితె
కరోన చెంతనె నాట్యమాడుతది!
రంగు వెలిసిన చొక్కాలైన
చిరిగిన చొక్కా లైన
శుభ్రం చేసీ తొడగకపోతే
నీ చొక్కా పైన కాప్షనౌతదీ
లవ్ మీ యంటూ పిలుస్తు ఉంటది!
పైలం బిడ్డోపైలం! నీ అవ్వలు అయ్యలు సల్లంగుండ పైలం!!

     --------యెనిశెట్టి గంగా ప్రసాద్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)