తొలి పండుగ
తొలి పండుగ
***********
పండిన పంటకు ధరల్ వచ్చినన్నానాడే తొలి పండుగా
ధాన్యరాసులతొ గాదం నిండగ సంతసమ్మె గద దండిగా. !!పండిన!!
తొలకరి మబ్బులు కురిసిన నాడే
వెలుగు రైతు కనులప్పుడే.
నాగటిచాలున చిక్కిన నేలన నవ్వులు విరిసేదప్పుడే. !!పండిన!!
మొలకెత్తిన కూనలు చూడ వెలుగు చిరునవ్వులే.
కొంటె నవ్వుల కోనంగిల ప్రక్కనుండు కలుపు మొక్కలే. !! పండిన!!
ఆట పాటలతో అలరు కోమలుల నాటు కాలమ్ములే.
ఏపుగ పండిన పంటను జూడ కన్నబిడ్డ వలెనుండులే. !!పండిన!!
ప్రేమగ నిమిరిన పైరుసొగసులే మదిన నిండుగుప్పొంగులే.
ఎంతపండినా పండిన పంటకు ధరయె వచ్చిన సంతసమే. !!పండిన!!
మార్కెట్ డిమాండ్ యెరిగి వేసిన పంటయె
మెరుగని తెలుసుకో
వేసిన పంటకు దరలు గిట్టుటయె నిక్కముగా నిజమౌనులే!! !!పండిన !!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి