కలాల కవితలు

            కలాల గళాలు
   *************
గ్రహణం నీడలో కలాల కవితలు
పరువులెత్తి పోతున్నయ్!
సప్తారుణ దినోత్సవాల
దివ్వెలు వెలుగులు చిందిస్తున్నయ్!
ఇరువురు కవుల జ్ఞాపకాలు
వెన్నుతట్టి పిలుస్తున్నయ్!
కర్తవ్యపు కాగడాలు
కదిలి వచ్చి ముందు నిలిచి చూస్తున్నయ్!
నినాదపు ముసుగులో నిలిచి పోకు మిత్రమా!
నీడలా వెన్నాడి నడిచి సాగు మిత్రమా!
స్పూర్తి నిచ్చే నినాదాలు
జ్ఞాపకాల దొంతరలో జ్ఞాన నేత్రం తెరిపించే
దినోత్సవాలు
ప్రజాస్వామ్య ప్రజ్ఞా పాటవానికి సోపానాలు
విద్వత్కవుల విదుర నీతులు
జనస్వామ్యపు జ్ఞాన నేత్రాలై సాగాలి
శాంతి కపోతాలై ఎగరాలి!!

                       *****
             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

*** నేడు అపూర్వ సూర్య గ్రహణం
ఫాదర్స్ డే, యోగా డే, హైడ్రో గ్రఫీ డే, హ్యాండ్ షేక్ డే, మ్యూజిక్ డే, టీ షర్ట్ డే,డూమ్స్ డే.
తెలంగాణ ఉద్యమ పిత ఆచార్య జయశంకర్ వర్ధంతి, మరియు తెలంగాణ ఉద్యమ గళం పాటలరచయిత,(నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కు పాటు ఫేం)
గూడ అంజన్న వర్ధంతి సందర్భంగా....

                          తేది:21-6-2020.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)