వందనం రైతన్నా..! ఆత్మగౌరవ సంపన్నా..!

వందనం రైతన్నా..! ఆత్మగౌరవ సంపన్నా..!
*************************************

దేశానికి అన్నదాతవై నిలిచినావు గద సోదరా!
హలంపట్టి పొలంబాట పట్టితివిగ సోదరా
                                 !! దేశానికి!!
చెమటోడ్చి పండించిన ధాన్యరాశి చూసి నీవు సోదరా
గర్వంగా చెప్పుకునే రాజు వయ్య సోదరా
రైతు రాజు వయ్య సోదరా!   !! దేశానికి!!

ధరవస్తే సంతసించి పొంగి పోదువయ్యా
రాకున్నా మానవు నీ పోరాటం సోదరా
వానలొచ్చి,వరదలొచ్చి ముంపుకు గురియైనా
గుండె నిబ్బరమ్ముతో మరోపంటకై చూతువు సోదరా!       !! దేశానికి!!
వెన్ను విరిచి గర్వంగా తిరుగు వారికాదర్శం నీవే
మనజాలదు యేదేశం రైతు సంతలేక
ఓర్మియున్న శ్రమజీవివి కోరికలకు అతీతుడవు సోదరా.         !! దేశానికి!!
ప్రతి యేడూ పంటవేయ పోరాటం నీదెరా
ఓడినా గెలిచినా ఓపికంటె నీదిరా!!
పండిన పంటకే ధరవస్తే పండగే
రాకున్నా మరోయేటి కాశించి యెదిరి చూపులే!                    
అయినా ఆగదు నీ పోరాటం
చెరగదు నీ గుండె లోన ఆరాటం
నీ గుండె నిబ్బరానికిదే వందనం! అభివందనం!!              !! దేశానికి!!
                *********
              --------యెనిశెట్టి గంగా ప్రసాద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)