జాగ్రత్త

ఆచితూచి అడుగేస్తే అంతమొందు కరోనా
అదమరిచి మాస్కుదీస్తె నోటదూరు కరోనా
నీ నోట దూరు కరోనా!

లాకుడౌను సడలెనని సరదా దీర్చుకుంటననీ
రోడ్డు మీద కొస్తె నిన్ను కరోనా
నీ వెంట నీడలా  చూస్తుంటది కరోనా

దూర దూరంగుండకుంటె కరోనా
నీ దగ్గర కొచ్చేది ముందు కరోనా
 చేతిలొ చెయ్యేస్తి వంటె కరోనా
నీచేతిలోకె చేరునులే కరోనా
నమస్కార బాణంతో చలోనా

కొంత కాలమాగుదాము వినుమా
ఇంకొంత కాలమాగుదాము వినుమా
స్వేచ్ఛ లేని బ్రతుకంటే కరోనా
నిన్నే హరించి వేయు కరోనా!!

      --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

తేది: 30-5-2020 నాటి ప్రజా కలం దినపత్రిక లో ముద్రితము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)