భారతీయ సంస్కృతి (పద్య కవిత)
భారతీయ సంస్కృతి
****************
కరచాలనమన స్నేహము
కరములు జోడించుటన్న గౌరవమొప్పున్
కరకమలములే యొప్పును
కరవాలములీయబోవు కారుణ్యమ్మున్!
ధర్మాధర్మము లన్నియు
మర్మము తోకూడియుండె మనశాస్త్రమ్ముల్
కర్మాచరణము వదలని
మర్మాలెన్నియొ గలవట మహనీయంబుల్!
ఓర్మిని జూపెడు దేశము
దుర్మార్గులు చెంతజేరి దూరిరిగాదే!
దుర్మార్గపు సంస్కృతియే
ఫర్మానా యాయెనేడు భారతి గనుమా!
దుర్మతులొక్కింతగలిసి
ధర్మాత్ముల దేశమందు తాళగ బోరే
కూర్మిని గలిగించగలుగు
కర్మానుష్ఠానము మన కర్తవ్యమ్మౌ!!
-------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి