నారాయణి (కవిత)
నారాయణి
**********
కరోనా కాలమిదీ
కనుచూపులె పనిచేస్తయ్
ముక్కులు మూతులు
మూసుకుని కూచుంటయ్!
ఏ యిద్దరు కలుసుకున్నా
దూరం దూరం
నమస్కార బాణమే
పలకరింపు
అదే క్షేమసమాచార సూచిక...
కరోనా కాలంలో
కలకలం వలదు
నర్సమ్మలే నారాయణమ్మలు!!
కరోనా బాధితులకు
రక్షకురాండ్రు
నాడైనా నేడైనా
వారే ముఖ్యురాండ్రు
అందుకే అందుకోమని
జోడిద్దాం! కరకమలమ్ముల!!
***
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి