ఏలిక (పద్య కవిత)
ఏలిక
*****
౧. ఉ.మా!!
కాంచగ లేమె చిత్రమది కారణమెద్దియొ తెల్యనేరకన్
తెంచెడు బంధమేను పలుతీరుల చక్కగ మార్పులొందుచున్
పంచును రోగమొక్కటిగ బాధలుబెట్టుచు నుండు లోకులన్
వంచనలెన్నిజేసె కడు ప్రాభవమొందె కరోనయేలగన్!!
౨.ఉ.మా!!
దారుణమయ్యెనేడు దరి దాపున నేరక నుండబోకుమా
నీరుణ ముంచబోము మదినిండుగ నెప్పుడు మెప్పుజేయగన్
మారణహోమమౌను మరి మాన్యతవీడుచు తిర్గినంతనే
కారణమౌటనిశ్ఛయము, గావున ద్రుంచుకరోన యేలగన్!!
౩. ఉ.మా!!
ఆకలి దప్పులేల?అనువయ్యెడు ప్రాంతములందుకార్యముల్
చేకొని వెట్టియైన పని జేసెడు వారలు వీడివచ్చిరే
కాకలు దీరినట్టి కడు కండలవీరులు భ్రాంతి నొందిరే
యీకలు పీకుచుండె యిట యెంతటి వారె కరోన యేలగన్!!
౪.ఉ.మా!!
భౌతిక దూరమంచు పరిపాలకు లెన్నివిధాల జెప్పినన్
చేతినికడ్గుకోవు దరి జేరును కీటక జీవు లెప్పుడున్
ఖ్యాతిగడింతువయ్య పలు ఖచ్చిత
మయ్యెడు సూత్రముల్ వినన్
పాతకమౌను గాదె గన ప్రాభవ మొందు కరోనయేలగన్!!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామారెడ్డి.
సర్వ జగద్రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పద్యాలు సంకలనం చేయించాలి అనుకుంటున్నాను గోవిందాక్షర శతకం : అక్షరానికి వంద పద్యాలు
రిప్లయితొలగించండిఛందస్సు : మీ ఇష్టం
భాష : తేట తెలుగు, సంస్కృతం , ద్విభాషా మిళితం
మొదటి శతక పద్యం: (అకార పద్యాలు వంద సేకరిస్తాము)
అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి.
పద్య భావము వేంకటేశ్వరుని కీర్తిస్తూ కానీ స్వామి రూపాన్ని వర్ణిస్తూ కానీ స్వామి లీలలు తెలుపుతూ కానీ ఉండాలి.
ప్రతి పదార్ధ భావాలూ కూడా పద్యముతో పాటూ తెలపాలి
మాకు అందిన పద్యాల ను వీడియో సంకలనం చేస్తాము. ప్రతీ పద్యముతో పాటూ రచయిత /రచయిత్రి పేరు ముఖ చిత్రము మరియు వారి వివరాలు వీడియో లో నిఖిప్తం చేస్తాము
గమనిక : ఒకరు ఎన్ని పద్యాలు అయినా రాయవచ్చు
send your poems to slokalupadyalu@gmail.com / slokalu@rcsindia.co.in
Whats app : 9490702244