తొలకరి(పాట)

                తొలకరి
                *******
తొలకరి మబ్బుల చినుకులు చిందే ఏమి హాయిలే హలా!
చిరు చిరు నవ్వుల చిన్నా రులే చిందులు వేసిరి భళా!
కురిసిన జల్లులు మెరిసే మబ్బులు పిచ్చిక గూళ్ళకు వన్నెలు దెచ్చే ఆహా!
మబ్బుల చాటున దాగిన కిరణం సింగిడి పూచెను భళా!
పూచిన సింగిడి వింటి నారియని తోచెన్ గద యీమదికి యేమనగలనిలా!
సప్తవర్ణముల యాభరణమ్మని మదిని దోచెగద యిలా!
                   *******

               --------యెనిశెట్టి గంగా ప్రసాద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)