మత్తులో చిత్తు

          మత్తులో చిత్తు
**********

మత్తెక్కించే మందు దాగితే చిత్తైపోతావు
గమ్మత్తులు జేస్తావు
మత్తువీడి నీ చిత్తరువుంగన 
చెత్తల వుంటావు
గమ్మత్తులు జూస్తావు!!

గుట్కల నమిలీ 
రోడ్డున ఉమ్మీ
రోగం తెస్తావూ
నీ దవడలు ఊడి
మాటే వణకగ
ముదుసలి వౌతావూ
వయసున ఉన్న ముదుసలివౌతావూ!
 
వేగం మరిచీ వాహనం నడిపీ
ఆహుతి వవుతావూ
మృత్యువు కాహుతివౌతావూ
అమ్మా నాన్నల భాగ్యరేఖ లను
చీకటి చేస్తావు!
ఆలు బిడ్డలకు దూరమయ్యీ
వీధుల తోస్తావు!

రింగు రింగుల పొగలను
వదలెడి సిగరెట్టంటావు
లేదా బీడీ లంటావు
బీడీ లైనా సిగరెట్ లైనా
నీ పుఱ్ఱెలు పుచ్చేను
ఒళ్ళు గుల్ల యీ
క్యాన్సరు తెచ్చేను
నీ జీవితానికి సున్నా చుట్టేను

అలవాట్లన్నీ చెరపుజేయగ
కరోన వచ్చేనూ!
మనలందర నొక్కటి జేసీ
మరణ శిక్షల నిచ్చేను
మారణహోమం! సృష్టిని జేసీ
నాట్యమాడేనూ!
మరణమృదంగమాడేను!

వద్దుర తమ్మీ వినుకో తమ్మీ
అలవాట్లన్నీ మానుకొనీ
విశ్వకళ్యాణం జేయుమనీ
వేడెద నెపుడూ, వేడెదనూ!!

              ******

         --------యెనిశెట్టి గంగా ప్రసాద్.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)