హోరు పాట!(కవిత)

హోరు పాట!(కవిత)
*****************
పాటల హోరులో
హోరు పాట సాక్షయ్యింది!
తె.ర.వే.లో దీటుగా నిలిచింది
నెలపొడుపు రోజున నెలవయ్యి 
స్తిరచిత్తులకు నేస్తమయ్యింది
గఫూర్ శిక్షక్ కలంలోసిరాయై, 
సమాజపు ఒంపు లకు
వన్నెలద్దే కుంచెగా 
నిలిచి నిలువెత్తు సాక్షయ్యింది!
సిద్ధాంతపు పోకడలో
స్థిరనివాసమేర్పరచుకొని
పాటే పోరు బాటయ్యింది!
ఘనాపాటి కవులకు
మేటి గా నిలిచింది!
పాడిన ప్రతి పాటా
నిప్పు కణమై మెరిసి
పచ్చి నిజాలకు నిలువెత్తు సాక్షిగా
పోరు బాటకు మొదటి అక్షరంగా
బాద్యతల బరువును మోసే
సైనికుడికి వెన్నంటి నిలిచే
అక్షరం ఈ హోరు పాట!!

         **********

****సిరిసిల్లా గఫూర్ శిక్షక్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో...!!

          --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)