సహృదయ స్పందన!(కవిత)
సహృదయ స్పందన
*****************
నింగి నేలను తాకిన నిప్పురవ్వ
నీడనిచ్చే చెట్టునే కాల్చినప్పుడు,
గర్జించిన మేఘం
నిర్జీవమై నీరుగార్చినప్పుడు
ధ్వని తరంగం అంతరంగాన్ని తొలిచేస్తూ
వరద యేరులై పొంగి పొర్లి పోతుంటే
కొట్టుకు పోయిన గుట్టలు
గుండెలవిసేలా రోదిస్తూ
కోటి గొంతుకలు గొంతెత్తి చేసిన ఆర్తనాదం
అందని సాయం కోసం అర్రులు చాస్తుంటే
ద్రవించిన హృదయ స్పందనలకు
సలాము చేద్దాం!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి