పాట!

చేయాలని మనసుండాలి
చేతగాని పనియేముంది
నేతలు తలరాతలు మార్చే
ధీరులమని చెప్పుకొందురే!!     !!
ఎన్నికల్లో కొల్లలుగా నే
హామీలిచ్చిన నేతల్లారా
వినండి భాదితుగోల
కనండి సమస్య లివియే.         !!
ఎన్నెన్నో సమస్యలంటూ
అవలీలగ తీర్చెదమంటూ
ఖర్చుకు వెనుకాడకుండా
ముందుకురుకు చున్నారే!!      !!
పెన్షనర్ల సమస్యలంటే
చిన్న చూపు చూస్తారెందుకు
వృద్దులంటె గౌరవమంటూ
సమస్య దీర్చగ వెనుకడుగెందుకు
పి.ఆర్.సి పెండింగెందుకు
ఐ.ఆర్ ఇవ్వవెందుకు
కమిటీ యే సిఫార్స్ జేసిన
డెబ్బదేండ్లకే క్వాంటమివ్వవు.   !!
అడిగిన కోర్కెలు కొన్నే
ఇవ్వడానికి జాప్యమెందుకు
పోరాటం చూడాలని వుందా
పోయేదేమని అనుకున్నావా!
పోరాటం ఆగదింకా
ఇచ్చేవి ఇవ్వకదప్పదు
న్యాయం మావైపునుంటే
మా గెలుపే మీదికాదా!!        !!
ధరలేమో పెరుగావట్టే
రోగాలు తొంగి చూడగ
అనారోగ్యం కాటు వేయగ
పొంచి పొంచి చూస్తోందే
పెన్షనేమొ పెరగదాయే
నిరుద్యోగ పిల్లలున్న 
బాధితులకు బాధ్యత దీరదు
మనసు కేమొ వేదనాయే
మాబాధ మీకు పట్టదాయే.       !!
మా సమస్య దీర్చక తప్పదయ్యా
పోరాటం ఆగదయ్యా
పోరాడి తెచ్చుకొంటిమి 
తెలంగాణ నే మనము
మనసమస్యలో లెక్కా
ఊరుకోము పక్కా!
వినుమయ్యా నేతా!
కనుమయ్యా విన్నపాలు!
తీర్చాలి తప్పదూ! పడవద్దూ తిప్పలూ!!
                                           !!

          --------యెనిశెట్టి గంగా ప్రసాద్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)