వలస కార్మికులు (కవిత)

అంశం: వలస కార్మికులు

         శీర్షిక: వలసల వ్యవస్థ!
                  **************
కలంపట్టని యోధులు
కరవాలం పట్టని వీరులు
బ్రతుకు తెరువెరుగని బాటసారులు
అవిచ్ఛిన్నంగా పయనం
ఎల్లలెరుగని ప్రయాణం
మమకారపు విలువలకన్నా
అనురాగపు అడ్డుగోడల్ని చీల్చుకొని
అలుపెరుగని బాటసారి యై
బ్రతుకు చట్రంలో ని బాద్యతల
బంధాలను అధిగమించడానికి
చేసే ప్రయత్నం! ఎందాకా!
రాష్ట్రాలు మారినా, దేశాలు మారినా
ఎప్పటికైనా నీ మమకారాల అనుబంధం
అజరామరం! ఏనాడూ తెగని అనుబంధం
                       
ఎండ వానెరుగని జీవులు
ఉపాధి గలచోటే వారి ఊపిరి
మనిషెక్కడున్నా,
మనసు మమకారపు బంధాల్లోనే!
ఆత్మీయుల అనురాపు ఊపిరిలోనే!
                       
కాలం కలిసి రాక కలకలం రేపిన కణం
కడుదూరపు వ్యవస్థను కకావికలం చేసింది
ఉదయించే రేపటి సూర్యుల కుపశమనం
కలిగించే వ్యవస్థ రూపుదిద్దుకుంటేనే
ఈ దేశ పురోగతి కి పునాది!!

              --------యెనిశెట్టి గంగా ప్రసాద్.
                                      కామారెడ్డి.
                       సెల్: 9866447234.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)