కవిత్వమా...!(కవిత)

            కవిత్వమా.‌..!
            ************
కవిత్వపు పొరలుగమ్మి
కార్యసాధన శూన్యమయ్యే
వర్ణణాత్మక రచనజేసి
వాస్తవాలే మరుగునబడె
దారిదప్పిన బాటసారీ
గమ్యమెరుగని గడుసరీ
యెచటకోయీ నీ పయనం
యెందాకా నీ పర్వం
కళ్ళు విప్పీ లోకంచూడూ
కరుణ జూపీ కథనం వెతుకూ
కంటి కాటుకవై కన్నీటి ధారలవై
ప్రవాహపు పొంగులో సేదదీరే నేస్తమా
కళ్ళు తెరచీ చూడవోయీ
వాస్తవాల గమనించవోయీ!
జరుగుతున్నది మారణ హోమం
మాడుతున్నది మానవ శలభం!

            --------యెనిశెట్టి గంగా ప్రసాద్..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)