శాపాలే!(కవిత)

శాపాలే!(కవిత)
**************

పట్టెడన్నం కొరకు పుట్టెడు పాట్లాయె
పట్టువిడుపులేని బ్రతుకు లాయె!!
బ్రతుకు భారమవగ సమ్మె తప్పదాయె
సమ్మెయనగ మాకుసమ్మెట పోటాయె
మిగులవట్టె మిక్కిలి వేదనలే మాకు
ఎన్ని నాళ్ళదాక దొరతనమ్ము?
సమ్మె అసమ్మతము, హక్కు లేదంటు
హుంకరించుటేల?ముఖ్యవర్య!
ఆర్టీసి అందరిదీ,అందరిలో మేమొకరం
ఎరుగకుంటె యెలా?ముందుతరాలకు
ముఖ్యవర్యుడవని అంటారే!
ఎలా సాధ్యం?యేదినిజం?
అందరినీ కలుపుకు పోతే
కాదేదీ అసాధ్యం?
కాకుంటే మిగిలేదీ యెవరికైన
తలా పిడికెడు శాపాలే!

            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)