ఆగండీ!ఆగండీ!(పాట)
ఆగండీ! ఆగండీ!(పాట)
********************
ఆగండీ! ఆగండీ
తమ్ముల్లారా! చెల్లెల్లారా
ఆగండీ! ఆలోచించండీ!
పరీక్ష లంటే భయము వలదులే
ఫలితాలంటే చింతపడొద్దూ! !! ఆగండీ!!
అమ్మా నాన్నల ప్రేమమూర్తులూ!
నేటి భారతికి త్యాగనిరతులూ!
అభివృద్ధికి మీరు పునాది రాళ్ళు!
ఆనందానికి వారధులూ!! !! ఆగండీ!!
పదులు దాటిన వయసే మీది
పాపం పుణ్యం యెరుగనివారే!
విజయ సాధనకు పోరాటం!
విజ్ఞత యెరుగని వయసయ్యా!! !! ఆగండీ!!
ఆత్మహత్యలకు అలవి కాదులె
ఆలోచించిన అవగతమౌనూ!
నిన్ను నీవే చంపుకొనీ
అమ్మా నాన్నల చంపొద్దూ!! !! ఆగండీ!!
జీవితమే ఒక పోరాటం!
అనంతమైనది ఈ యాగం!
ఈయాగంలో నువు కావొద్దూ
సమిధగ మారొద్దూ! !! ఆగండీ!!
పదిలో పరీక్ష లైనా
ఇంటర్మీడియట్ పరీక్షలైనా
ప్రాణం తీసే ఫలితాలకు
నువు వెరువొద్దూ!!
నీ జీవితానికీ అంతం పలకొద్దు. !! ఆగండీ!!
నీ ప్రాణం నీది కాదు, నువ్వే నాప్రాణమనే
అమ్మా నాన్నల ప్రేమఫలమనీ మరువొద్దూ!!
!! ఆగండీ!!
చేద్దాం చేద్దాం పోరాటం!
అవినీతికి ఎదురుగ నిలబడదాం!
కర్కశ హృదయం కరిగిద్దాం!
కారుణ్యమునే నిలబెడదాం!! !! ఆగండీ!!
మీ వెంట వున్నదీ సమాజమూ!
మీ ఆలోచనలకు ఆలంబనగా
న్యాయం కోసం ధర్మం కోసం
అండగ నిలబడునీసమాజం!! !! ఆగండీ!!
****"****
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి