రాజకీయ విలువలు!(కవిత)
రాజకీయ విలువలు!
******************
మానవత్వపు విలువలు
మరుగునబడిపోతున్నయ్
(మంటగలిసి పోతున్నయ్)
కులాల కుంపట్లు రాజుకుంటున్నయ్
మతాల మారణ హోమం
రగుల్తూనే ఉంది!
మతమార్పిడి చిచ్చు ఒకవైపు
కులాల ఎగదోత మరోవైపు
మనుషుల్లొ మార్పుకు
అవరోధం కల్పిస్తున్న
మేధావుల రాజకీయం
అంతుబట్టని నాటకీయం
అభివృద్ధి దిక్కులు చూస్తూ
నడి బజారులొ నిలబడి ఉన్నది
న్యాయం చట్టం చేతిలొ
నలిగి పోతున్నది
ఎన్నాళ్ళయినా
రిజర్వేషన్ వదలనంటున్నది
ఆసరాలు అలాగే ఉండాలంటున్నయ్
అందుకే అభివృద్ధి ఎటుబోతున్నది?
పార్టీ నేతల ప్రణాళికల్లొ
పదిలంగా దాగున్నది!!
.....:::::.....
__యెనిశెట్టి గంగాప్రసాద్
కామారెడ్డి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి