ఓటు వేయు!(కవిత)
ఓటు వేయు!
""""""""""""""""
కోటకు బీటలు వారునో
ఓటులవూట కోటకు జేరునో
పూటుగ త్రాగుచు ఓటెటువేతురో
జనం నాడి జగతిన పట్టలేరెవరును
విజ్ఞులెందరో గలరీఉర్విలోన
పట్టపు రాజుల భవిత నేడే గదా!
పరుగునజేరవచ్చు చున్నట్టి
ధీర ఓటరులార! దూరప్రాంతాల
విడిచి యరుగుదెంచి ప్రభువు లెవరో
నిర్ణయించ, చనెడు స్వస్థలంబుల
ఓటమెరుగని వీరులు మీరే
నోటు బంచిన నేతల దునుమాడఓటు వేసి, నిలుప రావయ్య ప్రజాస్వామ్య మరియ!!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామారెడ్డి
సెల్: 9866447234
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి