అదృశ్య కదలిక! (కవిత)
అదృశ్య కదలిక!
***************
నిరసన గళం నింగి కెగిసేదాక
నిండు కుండ యెపుడు
తొణికియుండే దాక
వేచి యుండవలదు
నివురు గప్పిన నిప్పు
తోసుకొచ్చినపుడు
అగ్ని జ్వాలలు దెచ్చు ఆర్తనాదాలు
అపభ్రంశపు సంకేతాలు
ఆత్మహత్యలు కూల్చేగోడల పునాదులు
ఆది లోన తృంచేసే ప్రయత్నం
ఆర్తుల కనందకరమగు సోపానం
అణచివేత ఆపద్ధర్మ ప్రయత్నమైనా
అధికార పునాదుల కదలికకు సూచికే...
అర్థం చేసుకుంటే అంతా కుశలమే
లేకుంటే మనమింటికే...............!!
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామారెడ్డి
సెల్: 9866447234.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి