అక్క కోసం/తపన(కవిత)

      అక్క కోసం!(తపన)
**************
అక్కా బావెక్కడో
ఆనందం అక్కడే
బావ ప్రక్క కలిసి నడువ
పరువు నిలుచు నప్పుడే!
నీవెరుగని దానవా...
నేను జెప్పదగునా!
కోపం కాసింత
శృంగారం కొండంత
సముద్రాన అలలవోలె
నిలువదులే క్రోధం
నిలువెత్తున నిలిచిన నీ
బంగరు రూపం
కొట్టవచ్చినట్టున్న నీ
కోమలత్వ రూపం
చిరునవ్వుల చిందులేసె
ముగ్ధమోహనత్వం!
అందమైన రూపానికి
అమాయకత్వ లక్షణం!
అదే నీకు అమరినట్టి
అలంకార భూషణం!!        !! అక్కా!!

            *****
             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)