ఆర్టీసీ సోదరా (ఉద్యమ గీతం)

ఆర్టీసీ సోదరా (ఉద్యమ గీతం)
**************************
లెమ్ము లెమ్ము సోదరా
ఆర్టీసీ సోదరా
అండనీకుండగా
అధైర్యంవలదురా
సమ్మె మనహక్కురా
ససైన్యంగనడువరా
సమైక్యంగ ఉంటేమరి
సాధించగ లేనిదేది
ప్రభుత్వంలొ భాగమై
లాభాలబాట నడుపగలవు
విజ్ఞత నే పొందెదవు
ఉద్యోగపు భద్రత
మనిషి హక్కు సోదరా
ప్రజల కొరకు నీవు
నీ కొరకే ప్రజలురా
మీరందరు కలిస్తే
ప్రభుత్వాలె మారురా
అదే తెలియజేయగా
దిగరాకతప్పదురా
పాలకులూ,పరిపాలకులూ
దిగిరాక తప్పదూ!
          ******
           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)