ఆత్మావలోకనం!(కవిత)

ఆత్మావలోకనం!
**************
మెచ్చని పేపరోళ్ళనుజూసి
మనిషి దిగాలు పడ్డడు
దీనంగా ఉన్నమొగాన్ని జూసి
ధనం ఆశ జూపి కవితరాయిచ్చుకున్నడు
కొత్త ప్రక్రియంటూ కూచున్న చోట పంపిస్తే
బిరదిచ్చి, ప్రశంసాపత్రం పంపిస్తన్రు!
సాహిత్య సేవంటూ సంఘాలు బెట్టి
కొత్త కవిత్వాలు కొల్లలుగా సృష్టిస్తున్రు!
కవిత్వమే మో గానీ పైత్యం ముదిరి
అదేపనిగా వ్రాసి కాగితాలు నల్లగైతున్నయి
కవుల కళ్ళు బైర్లుగమ్ముతున్నై!
కార్యశాలలేంజేస్తయి? 
మల్లెపందిరి వద్దకు మనసును తెస్తయా?
ఆ మల్లెల గుభాలింపులు మనసుకు తట్టాలె
తట్టిన మనసు కలంపట్టి వ్రాయగలగాలె
వ్రాసిన దాంట్లో పట్టుండాలె
వ్రాయడమే ముఖ్యమైతే ఎవరైనా వ్రాయొచ్చు,ఎన్నైనావ్రాయొచ్చు
వ్రాసిన దాంట్లో భాష ముఖ్యం భావం ముఖ్యం!
అది వొసగే సందేశం ముఖ్యం! సమాజానికుపయోగపడటం ముఖ్యం!!
బిరుదులు మన పేరును దూరం చేస్తాయి
ప్రశంసాప్రత్రాలు మనను ప్రశ్నిస్తుంటాయి!
ఆత్మావలోకనం చేసుకోమని!
నిన్ను నీవు ప్రక్షాళన చేసుకోమని!
                 *******

                --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)