మన ఆర్టీసీ!(కవిత)
మన ఆర్టీసీ!(కవిత)
****************
ఏలినవారికేంతెలుసు
ఏపాట్లైనా పేదోడికే తెలుసు
విభజించి పాలించడం
విజ్ఞులకే తెలుసు
విజ్ఞత లేని వెఱ్ఱి
నాగన్నకేంతెలుసు
అందుకే తెలంగాణ
వాదానికూతమిచ్చిన్రు
సకలజనులసమ్మెకూతమిచ్చిన్రు
ముందుండి సైరన్ మ్రోగించిండ్రు
హామీల గుప్పించి వెన్ను దట్టిండు
సెల్ఫౌటంటు వెన్ను బొడిచిండు
విభజించి పాలించడం
విజ్ఞులకే తెలుసు
విజ్ఞత లేని వెఱ్ఱి నాగన్నకేంతెలుసు?
నలుబది మూడడిగితే
నలుబది నాలుగిచ్చిండు
నష్టాలు వచ్చెనని
ప్రైవేటు కిచ్చిండు
అప్పు గట్టలేక ప్రైవేటు కిచ్చునా
ప్రభుత నప్పగించి ప్రజలకు
బానిసత్వమ్మునే బహుమతిగ నిచ్చునా!
ఏమెరుగని పేదోడు యెర్రిబాగులోడు
రోజు కూలికి బస్సునడిపెదనంటు
లైనులో నిలబడే, ముందరున్న బ్రతుకు
తనదికాదనుకొనే!
ఈనాటి బాధితుడు ఆర్టీసి వోడు
రేపటి బాధితుడవు నీవు కావా!
పేదోడికి పేదోడే శత్రువైతే
ఆ పేదోడికి పెన్నిదేదీ?
సబ్సిడీ లిచ్చు పాలకుడా
నీ సబ్సిడీ బాకిదీర్చుముందర
అందుకో లాభాలను
విలీనం చేసి చూపు
విజ్ఞతను పెంచుకో వివేకుడిగ మసలుకో
పాలాభిషేకాలందుకో!
ఆర్టీసీ అందరిదీ,మీదీ,మాదీ,మనది!!
***********
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి