ఓటరు ధీరుడే!(పాట)
ఓటరు ధీరుడే!
**************
ఓటమెరుగని ఓటరెప్పుడు ధీరుడే
ఓటు విలువను తెలుసుకొనినప్పుడే
నోటుకోటును నమ్మబోకను
ఓటమూల్యమైనదని యెరిగినన్.
!!ఓటమెరు!!
లంచగొండుల తరిమి కొట్టి
నీతి పరులను యెన్నుకొనుచు
జాతి మేల్ తలపెట్టినప్పుడె
ప్రజాస్వామ్యం పరిఢవిల్లును. !!ఓటమెరు!!
కులమతాలను పోషిస్తూ
రాజకీయం రంగుదేల్చగ
రిజర్వేషన్ చిచ్చుబెట్టగ
వర్గ పోరులు తప్పవయ్యె. !!ఓటమెరు!!
చిన్న చితకపార్టీలతొ
చిచ్చు రేపెడి నాయకులే
పదవిమోహము పదును అవుతూ
మత్తుగొలిపెడు తాయిలాలే తమ్ముడూ
!!ఓటమెరు!!
**
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి