అలసి పోని పలకరింపు!(కవిత)
అలసి పోని పలకరింపు!!
******************
కొరుకులు బడ్డ చొక్కాలాగ
కొత్తపుంతలు తొక్కుతోంది కవిత్వం!
పురస్కారాల పైత్యం ప్రకోపించి
ఏదారిన వెల్లనున్నదో...
సహస్ర,శతసహస్ర కవి సమ్మేళనాలు
శాస్ర్తీయతను లెక్కించే తీరిక లేదు!
ఆన్లైన్ అవధానం అందుకోలేని ఎత్తుకెదిగి
పాప ప్రక్షాళనం చేసుకుంటోంది
బిరుదుల విందుభోజనం
అంగట్లో సరుకయ్యింది!
వ్యాపార, వ్యవహారాల సంతలో
వేలం పాట కు నెలవయ్యింది
కాలానికి గాలం వేసి
కరోనా విజృంభించి
కవన కుతూహలాన్ని రేకెత్తించింది
వ్రాత లో పస పోయింది
తలరాత మారిపోయింది!
సన్మానాల శాలువాలు బరువైపోయినయ్
లేవనెత్తే వాళ్ళుంటే బాగుండు!
పురస్కారాల అల్బం అందంగా
రంగు రంగు లతో మెరుస్తూ
కోరికల సాఫల్యత వెన్ను తట్టి గుర్తు చేస్తూనే ఉంది!
ప్రతి రోజూ అద్దాల బీరువా లో
ఉదయాన్నే నన్ను పలకరిస్తూ నే ఉంటుంది!
నా కలం అలసి పోవద్దని హెచ్చరింపుగా...!!
*******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి