ఆశల హరివిల్లు!(కవిత)


*ఆశల హరివిల్లు*
  **************
మబ్బు పట్టిన ఆకాశం
కన్నీరు కార్చడానికి
సిద్ధంగా ఉంది
ఆ కన్నీటి బాష్పాలు
వరదై ప్రవహించిన ప్రవాహం లో
కొట్టుకు పోతున్న జనాన్ని చూసి
ఆకాశం నవ్వుతోంది
ప్రశాంతంగా సేదదీరుతోంది
రంగుల హరివిల్లును పూయిస్తోంది!

తడి యారిన నేల ధవళవస్త్రం ధరించి
నింగితో దోస్తీ చేస్తోంది!
కొట్టుకు పోయిన జనం కోసం
మిగిలిపోయిన శోకతప్త హృదయాలు
సానుభూతి కోసం అల్లాడుతున్నయ్!

అందించిన ఆపన్నహస్తం
కంటితుడుపు చర్యల్లో భాగమై
బాధలు, బంధాలకు దూరమై
భావి తరాలకు మార్గదర్షకమై
రానున్న కాలానికి
ఏదో చిన్న ఆశ....
కంటికి వెలుగు దివ్వెయై
మార్గ దర్శనం చేస్తుందేమో నన్న ఆరాటం
బ్రతుకును వెళ్ళదీస్తున్న తరానికి
కొండంత అండగా నిలువాలన్న ఆశ
నన్ను నడిపిస్తోందిన్నాళ్ళు.....!
                   *****
          --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)