భాషకు పట్టాభిషేకం!(కవిత)

భాషకు పట్టాభిషేకం!
******************

దేశభాషలందు లెస్సభాష తెలుగు
తేటతేట పదాలనల్లు తెలుగు
మాండలికమునల్లు మది చూరగొను తెలుగు
జీవభాషలకెల్ల మేలు తెలుగు
అమ్మ భాష తెలుగు
అమృతభాష తెలుగు
కమ్మనైన పదాల తేట తెలుగు
అమ్మ,నాన్నల పిలుపు
అమృతమయ్యేను
మమ్మీ, డాడీల పిలుపు
కృత్రిమంబే యౌను
తెలుగు తోడుగ పరభాష మేలౌను
పరభాషకు తెలుగు తోడుండతగదు!
మనము పుట్టిన గడ్డ పురిటి గడ్డ
భాష పుట్టిన గడ్డ మరువ తగదు
అప్పడే మన భాషకు పట్టాభిషేకమగును!!
                   .....:::::.....

                   -------యెనిశెట్టి గంగాప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)