జోహార్ రైతన్నా!(కవిత)

జోహార్ రైతన్నా!(కవిత)
********************
బండబారినబ్రతుకులకు
మొండివాదన!
మోడువారిన బ్రతుకులకు
మిగిలెవేదనా!
పండించిన రైతు కన్న
పండించని రైతు మిన్న
మిన్నకుంటే రైతు భరోసా
సాగుచేస్తే గుండె కోతా
పసిడి లాంటి పసుపు రైతుకు
పోరాటమే విధివ్రాత!
కలంబట్టిన కవి కన్నా
కలిసి చేస్తున్న రైతు పోరాటం మిన్న!
నిరసనల వెల్లువ నింగినంటినవేళ
రైతే రాజుగా పోటీ లో ఆరాటం!
నిర్మలచిత్త పోరాటం!
అడుగడుగునా అడ్డు కట్టలేయబూనిన
విచ్చుకత్తుల కౌగిలి నుండి
విషపు నాగుల విస్తృత విన్యాసం
యేమీ చేయలేక బిత్తరవోయిచూస్తూన్న
రాజకీయ శక్తుల సుడి నుండి
పిడికిలి బిగించి ఐక్యంగా తెలిపే నిరసన
దేశమెల్లెడల ప్రాకి విశ్వవ్యాప్తమై
ప్రపంచానికే తలమానికమైన మీ నిరసనకు
జోహార్ రైతన్నా! జోహార్!

            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)