మరో జ్వలిత గీతం!(కవిత)
మరో జ్వలిత గీతం!
****************
ఆశువుగా చెప్పలేను
అప్పుడప్పుడో కవిత
అందంగా చెప్పగలను
ఆనందం కలిగినపుడు
మనసు ఉరకలెత్తినపుడు
పులకరించి పోతాను
మానవతయె పెరిగినపుడు
నన్ను నేను మరుస్తాను
దీనంగా జూచువాడి
కళ్ళవెనుక యేముందో
చూడగలిగితే నా గుండె
జాలిగా మూగవోయి చూస్తుంటే
నాకవితాధారయె స్ర్మృతిగా
నీకింకేమివ్వగలను?
నేత నసలు కాకపోతి
ఆసరాగ నిలువకుంటి
ఆశువుగా జెప్పు కవిత
నీ ఆకలి తీర్చదే
అయినా నీకేం తెలుసు
అక్షరానికున్న విలువ
అక్షరమే ఆయుధమై
ఉద్యమానికూతంగా
నిలుస్తుందని,
జాలిగుండె జలధారయై
మహోజ్వలపు ఉప్పెనయై
సాగుతుందని, జాలి లేని
నేతలంత మరుగున బడిపోతే
మరో జ్వలితగీతం
క్రొత్త వెలుగు నిలుస్తుందని...
*********
--------యెనిశెట్టి గంగా ప్రసాద్..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి