అవిశ్రాంత ఉద్యోగి!(కవిత)
అవిశ్రాంత ఉద్యోగి!
*****************
విశ్రాంత ఉద్యోగులమంటారు
అవిశ్రాంతంగా ఉంటారు!
వడివడిగా అడుగులేస్తు
జనంలోకి వెల్తారు!
ప్రజాసేవ చేయుటకై
పరుగులు దీస్తుంటారు!
వృద్దులసంక్షేమానికి
ఉరకలు వేస్తుంటారు
ఊరూరా సంఘాలను
వెలయింపజేస్తారు!
ఆలుమగల బంధాలను
బలోపేతం చేయుటకై
కౌన్సిలింగు చేస్తారు!
వైద్యశాలల్లొ
సహాయకులుగ వెల్తారు!
అమాయకపు జనులకిది
ఆలంబనగా ఉంది!
ఉరకలెత్తిన ఉత్సాహం
వయసును మరిపిస్తోంది!
మా మంచి సంఘమిది
మెరుగైన సంఘమిది
మధురస్మృతులకు
వెలుగు యిది!!
.....:::::.....
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి