ఇంకెన్నాళ్ళో...!(కవిత)

                   ఇంకెన్నాళ్ళో...!
***********

రక్తపు టేరుటులు పారించకుండానే
మౌనంగా రోదిస్తున్న కళ్ళు
యుద్దాన్ని చూస్తూనే ఉన్నయ్!
పోరాటం ఎవరు చేస్తున్నారో
ఎవరితో చేస్తున్నారో...

కత్తులు కటారులు లేవు
కరవాలపు చప్పుళ్ళు లేవు
యుధ్ధమేఘాలు కనిపించవు
అయినా యుద్ధం జరుగుతోంది
ఎవరికి ఎవరు శత్రువో తెల్యదు
అయినా పోరాటం సాగుతూనే ఉంది
చచ్చిన శవాలు ముట్టుకోడానికే భయం
దహనసంస్కారం నిరాడంబరం
మౌన రోదనలూ, మానసిక నిర్లిప్తత

చావులసంఖ్య తక్కువే అయినా
క్షతగాత్రుల మానసిక ఆందోళనే ఎక్కువ
పెరుగుతున్న సామాజిక దూరం
తరుగుతున్న మానవత్వం
కనబడని శత్రువు చేస్తున్న మారణహోమం
ఎన్నాళ్ళో ఇంకెన్నాళ్ళో....!
                  ******
           --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)