తలా పిడికెడు శాపాలే!(కవిత)

తలా పిడికెడు శాపాలే!(కవిత)
**************************

పులింజూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
మహాత్మున్నవ్వాలని,మన్నికైన దుస్తుల విడిచినట్లు
కోయిలలా పాడాలని,కాకి అరిచి నట్లు
సాధన లేని పనులు లక్ష్యాన్నెంచక
లెక్కకు మిక్కిలి సమస్యల నెత్తి కెత్తుకుంటే
వనరుల లెక్క కుదరక,
వాస్తు ప్రపంచాన్ని తిరగేసి
వాస్తవ ప్రపంచాన్ని చూడలేక
ఊహల్లో బ్రతుకుతూంటే
ఎన్నాళ్ళకీ సమస్యలు సమసిపోయేను
అప్పులోళ్ళు పీడిస్తుంటే
పన్నులమీద పన్నులేసినప్పుడు
తలా పిడికెడు శాపాలే!!
                *******
          --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)