మాతృభాష!(మణి పూసలు)

       మాతృభాష (మణి పూసలు)
        ************************
ఏదేశముననున్న
యేవాసముననున్న
మరువద్దునీభాష
మృతభాషకాదన్న!!

అమ్మ నేర్పిన భాష
అమృత మ్మదేభాష
చిన్న నాటనెనేర్పె
గోరుముద్దల భాష!!

యేభాష నేర్చినా
యేదేశమేగినా
చాటరా నీభాష
యేసభలకెల్లినా!!

ముద్దులొలికెడుభాష
అందమైనది భాష
ఆరాధ్యనీయమని
తెలుసుకొ మాతృభాష!!
           *****
         --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)