ఎవరు బాధ్యులు?(కవిత)

ఎవరు బాధ్యులు?
****************
కడివెడు కంటినీరొలికించెను కమలలోచన
తన మగడు త్రాగుబోతుయై 
తప్పుడు దారిన నడచుచునుండెనని
వచ్చిన నెలజీతంబీయక 
పూటకొక్క రుచులంగ్రోలెడు మగడితండు
మందు విందులకు మరిగినయీ
మగపురుషుడీతడు
డబ్బు మోజు పెంచుకొని
లంచానికి పెద్దపీట వేసినవాడై
పట్టుబడ్డ యీ  మనిషి
పదుగురెదుట నిలబెట్టెను
మగనాలిని యాతడు
అనాథలైరి చిన్నారి చిరు
ప్రాయపు పిల్లలు!
ఎవరు భాద్యులెవరు భాద్యులీ గతికి
త్రాగిన మగవాడిదా!
త్రాగించిన సహచరులదా!
అమ్మిన  షాపువాడిదా!
అమ్మించిన సర్కారుదా!
చట్టబద్ద హెచ్చరికలు
చట్టబద్ద అమ్మకాలు!
ఏవి నిజం!
ఎవరు భాద్యులు?
            .....::::.....

             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)